కరోనా లెక్కలు ఆన్ లైన్ లో దాచేశారు.. వారం నుంచి పోర్టల్ లో అప్ లోడ్ బంద్

కరోనా లెక్కలు ఆన్ లైన్ లో దాచేశారు.. వారం నుంచి పోర్టల్ లో అప్ లోడ్ బంద్
  • వారం నుంచి పోర్టల్ లో పేషెంట్ ఐడీ నంబరల్ అప్ లోడ్ బంద్
  • 86 వేల దగ్గరే ఆపేశారు.. ఆ ప్లేస్ లో శాంపిల్ నెంబర్లు
  • అసలు లెక్క బయటపడుతుందన్న ఉద్దేశంతో నిర్ణయం
  • లక్ష దాటిన కరోనా కేసులు..64,786 దగ్గరే ఆగిన బులెటిన్
  • మీడియాతో మాట్లాడకుండా ఆంక్షలు
  • తప్పుడు లెక్కలు చెబుతూ వైద్యరంగంలో దేశంలోనే మూడో ప్లేస్ ఉన్నామంటూ ప్రచారం.

కరోనా కేసులు, మరణాల అసలు లెకక్లు బయటకురాకుండా ఉండేందుకు రాష్ట్ర సర్కార్ ఆన్ లైన్ లో గోల్ మాల్ చేస్తుంది. ఏకంగా పేషెంట్లకు కేటాయించే నెంబర్ విధానాన్ని మార్చేసింది. ఇప్పటికే జిల్లాల్లో హెల్త్ బులెటిన్ లు ప్రకటించకుండా ఆపేసింది. ఇన్ పేషేంట్ల మరణాల విషయం బయటకు చెప్పొద్దని ఆస్పత్రుల సూపరిండెంట్ లను ఆదేశించింది.మీడియాతో మాట్లాడొద్దంటూ ఆఫీసర్లపై ఆంక్షలు విధించింది. ఇన్ని చేసినా కేసులు, మరణాల లెక్క దాగకపోవడంతో ..తాజాగా పోర్టల్ లో మార్పులు చేయించింది. తప్పుడు లెక్కలను ప్రకటిస్తూ..దేశంలోనే కరోనా కట్టడిలో ముందున్నామంటూ ప్రచారం చేసుకుంటోంది. వైద్యరంగంలో రాష్ట్రం మూడో  స్థానంలో ఉందని హెల్త్ మినిష్టర్ ఈటల రాజేందర్ జిల్లాల పర్యటనలో పదే పదే చెబుతున్నారు. ఇతర మంత్రులు కూడా కరోనా కట్టడిలో తెలంగాణ భేష్ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు.

వాస్తవానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండ్రోజుల కిందట్నే లక్ష దాటింది. సర్కార్ చెప్పే లెక్క మాత్రం 65 వేల దగ్గరే ఆగిపోయింది.సుమారు 40 వేల కేసులను ప్రకటించకుండా దాచేశారు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు కరోనా పోర్టల్‌‌లో మార్పులు చేశారు. ఇంతకుముందు పాజిటివ్‌‌ వచ్చిన వ్యక్తులందరికీ వరసగా నంబర్లు (పేషెంట్ ఐడీనంబర్‌‌‌‌) ఇచ్చేవారు. దీంతో పోర్టల్‌‌లో ఉన్న చివరి నంబర్‌ ‌‌‌ఆధారంగా ఎన్ని కేసులయ్యాయో జిల్లాల్లో హెల్త్ ఆఫీసర్లకు డాకర్టకు, పోర్టల్‌ ‌యాక్సెస్‌‌ ఉన్న సీనియర్ ఆఫీసర్లకు తెలిసేది. వారి ద్వారా విషయం బయటకు వస్తుండడంతో.. పోర్టల్ లో పేషెంట్‌ ‌ఐడీ నంబర్‌‌‌‌ కేటాయించడం ఆపేశారు. వారం కిందటి వరకూ పాత విధానమే కొనసాగింది. అప్పటికే ఆ నంబర్లెక్కను చూస్తే కేసుల సంఖ్య 86 వేలకు చేరుకుంది. జులై 26న సాయంత్రం వరకు పోర్టల్‌‌లో 86 వేల మంది వివరాలను అప్‌‌లోడ్ చేశారు. జీహెచ్‌‌ఎంసీ వెబ్‌సైట్‌‌లోనూ ఓ వ్యక్తికి పేషెంట్‌‌నంబర్‌ ‌‌‌85,785 ఉంది. జులై 27 నుంచి 31వ తేదీ రాత్రి 8 గంటల వరకూ 10,727 కేసులు నమోదైనట్టు బులెటిన్‌‌లో ప్రకటించిన లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో ప్రకటించని కేసులు మరో పది వేల వరకూ ఉండొచ్చునని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ కేసులకు పేషెంట్‌‌ నెంబర్‌‌కేటాయించకుండా.. కేవలం పేర్లు, ఫోన్ నంబర్లు ఇతర వివరాలు మాత్రమే పోర్టల్ లో అప్‌‌లోడ్‌‌చేశారు. పేషెంట్ నంబర్‌‌‌‌ప్లేస్‌‌ లో.. టెస్టింగ్ టైమ్‌‌లో ఇచ్చే శాంపిల్‌‌ ఐడీ వేశారు. అన్నింటినీ కలిపితే మొత్తం కేసుల సంఖ్య లక్షకు పైనే ఉండగా.. ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్‌‌లో మాత్రం 64,786 కేసులే నమోదైనట్టు చూపించారు.

టెస్టుల్లో లాస్ట్‌‌

కరోనా టెస్టుల విషయంలోరాష్ట్రం చివరి స్థా నం కోసం పోటీపడుతున్నట్లు విమర్శలువస్తున్నాయి. పక్క రాష్ట్రం ఏపీలో టెస్టుల సంఖ్య 20 లక్షలు దాటితే, మన దగ్గర ఇప్పటికీటెస్టులు5 లక్షలు దాటలేదు.టెస్టుల సంఖ్య పెంచాలని హైకోర్టు మొట్టికాయలువేసినా.. జనం ఇబ్బంది పడుతున్నా.. పెంచేందుకు సర్కార్ ఇష్టపడడం లేదు. వీలైనన్ని ఎక్కువటెస్టులుచేస్తూ,పాజిటివ్ వ్యక్తులను త్వరగా ఐసోలేట్‌‌ చేస్తే వైరస్ వ్యాప్తి, వేగం తగ్గుతుందని ఐసీఎంఆర్‌‌‌‌, డబ్ల్యూహెచ్‌వో వంటి సంస్థలు మొదట్నుంచీ చెప్తున్నా యి.కానీ,మన దగ్గర మాత్రం టెస్టులతో అసలు ఉపయోగమేలేదన్నట్టుగా కొందరు ప్రభుత్వ పెద్దలు కామెంట్లుచేస్తున్నారు. ‘‘టెస్టులు చేస్తే వైరస్ కంట్రోల్ అవుతుందా’’ అంటూ మూడ్రోజుల క్రితం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తక్కువటెస్టులుచేస్తున్నదనడానికి ఈ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.టెస్టుల్లో లాస్ట్ ఉండి, కేసులుమరణాలు దాస్తూ.. కరోనా కట్టడిలోముందున్నామంటూ సర్కార్ చెప్పుకోవడంపై విమర్శలువెల్లు వెత్తుతున్నాయి.

అపెక్స్ మీటింగ్ ను తప్పించుకునేందుకే కేబినెట్ భేటీ