
అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 1 నుంచి రాష్ట్రంలోని ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సొంత డబ్బుతో కరెంట్ బిల్లులు చెల్లించుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. జూలై 1 సీఎంగా తానూ, సీఎస్ ఈ రూల్ పాటిస్తామని చెప్పారు. రాష్ట్ర సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో అస్సాం సీఎం ఈ ప్రకటన చేశారు. అనంతరం ఆయన ట్వీట్ కూడా చేశారు.
75 ఏళ్లుగా మన మంత్రులు, ప్రభుత్వ సీనియర్, సచివాలయ అధికారుల నివాసాలకు కరెంట్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రజలు చెల్లించే టాక్స్ సొమ్ముతో ప్రభుత్వ అధికారులకు విద్యుత్తు బిల్లులు చెల్లించే వీఐపీ సంస్కృతికి ముగింపు పలుకుతున్నాం. ఇదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులంతా వారి విద్యుత్ వినియోగానికి అయ్యే బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది అని ట్వీట్ లో వెల్లడించారు.
దీనివల్ల విద్యుత్ బోర్డుకి వచ్చే నష్టాలను నివారించవచ్చని, బదులుగా వారు విద్యుత్ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉండదని సీఎం పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ సంస్థలను క్రమంగా సోలార్ పవర్‌కి తరలించడమే తమ లక్ష్యమని అన్నారు సీఎం. . రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు, విశ్వవిద్యాలయాల నుండి ఈ పనిని ప్రారంభిస్తామని తెలిపారు.