బ్యూటీ పార్లర్ అవసరం లేదు..ఇంట్లోనే కొబ్బరినూనెతో గ్లోయింగ్ స్కిన్!

బ్యూటీ పార్లర్ అవసరం లేదు..ఇంట్లోనే కొబ్బరినూనెతో గ్లోయింగ్ స్కిన్!

కొబ్బరినూనె గురించి మనకు తక్కువ విషయాలే తెలుసు. సాధారణంగా మనం కొబ్బరినూనెను జుట్టుకు ఎక్కువగా వాడుతుంటాం. కేవలం జట్టుకే కాకుండా, కొబ్బరినూనెతో ఇంకా బోలెడు ప్రయోజనాలున్నాయని ఎక్కువమందికి తెలియదు. ఎన్నో బ్యూటీ చిట్కాలకు కొబ్బరినూనెను ఉపయోగించొచ్చు. 

శతాబ్దాలుగా మన పూర్వీకుల సౌందర్యపరంగా ఎదురయ్యే సమస్యలకు పరిష్కారంగా దీన్ని ఉపయోగించారు.కొబ్బరినూనెను ఎన్నో సౌందర్య పరిష్కారాలకుఉపయోగించొచ్చు. మొహం మీది మొటిమలను, మచ్చలను తొలగించేందుకు బాగా ఉపయోగపడుతుంది. చర్మాన్ని సాక్షి, ఆరోగ్యంగా తయారుచేస్తుంది.

కొబ్బరినూనెను రెగ్యులర్ గా మొహానికి పట్టించడం వల్ల ఇలా చాలానే లాభాలు ఉన్నాయి. చర్మం త్వరగా ముడతలు పడదు. ఎక్కువసేపు పొడిబారకుండా ఉంటుంది. ఫేస్ లో ప్రెనింగ్ ను  తీసుకొస్తుంది.. స్కిన్ పై పేరుకుపోయిన డెడ్ సెల్స్ సుతొలగించడానికి కొబ్బరినూనె బాగా పనిచేస్తుంది. 

►ALSO READ | Beauty Tips: వంటింటి చిట్కాలు:  తెల్ల జుట్టుకు .. బెస్ట్ ట్రీట్ మెంట్.. నల్లగా మారుతుంది..నిగ నిగ మెరిసిపోతుంది..!

మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెలో... ఒక స్పూన్ చక్కరనూ, రెండు చుక్కల లావెండర్ నూ కలిపి ఒంటికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఇది డెడ్ సెల్స్ తొలగిపోవడానికి బాగా పనిచేస్తుంది. కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలకు కొబ్బరినూనె చక్కని పరిష్కారం.

డైలి కళ్లకింద భాగంలో కొబ్బరినూనె రాస్తూ ఉంటే, క్రమక్రమంగా అవి తగ్గుముఖం పడతాయి. కొబ్బరి నూనెతో పసుపు, పాలను కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకుంటి మొహం కాంతివంతంగా మారుతుంది.