అయ్యో పాపం : పరోటాలు ఎక్కవగా తినటంతో.. ఐదు ఆవులు మృతి

అయ్యో పాపం : పరోటాలు ఎక్కవగా తినటంతో.. ఐదు ఆవులు మృతి


ఆవు కనిపిస్తే దైవంగా చూస్తారు హిందూవులు.. వాటికి తినడానికి  ఏదో ఒకటి పెడుతుంటారు.. ఇలాంటి అత్యుత్సాహంగా.. ఆవులకు ఎక్కువగా పరోటాలు తినిపించారు. దీంతో ఐదు ఆవులు చనిపోయాయి. కేరళలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వట్టపరకు చెందిన హస్బుల్లా అనే వ్యక్తి  ఐదేళ్లుగా ఆవుల ఫారం నిర్వహిస్తున్నాడు. అతని పొలంలో 35 ఆవులు ఉన్నాయి. వీటిలో 15 ఆవులకు పరోటా తినిపించగా అవి ఒక్కసారిగా  కుప్పకూలాయి. 

 ముందగా ఒక ఆవు  జూన్ 15వ తేదీ  సాయంత్రం 4 గంటలకు, మిగిలినవి 16వ తేదీ ఉదయం 8 గంటలకు మృతి చెందాయి.  పశుగ్రాసం ఖరీదు ఎక్కువగా ఉండడంతో పొరోటా, కందులు, బెల్లం, చింతపండు తదితర వాటిని ఆవులకు తినిపించారు. ఆవులకు ఇచ్చే మేతలో పొరోటా, బెల్లం అధికంగా కలిపారని ఇవే వాటి మృతికి కారణమని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది.   

పశువైద్యాధికారి డాక్టర్ డి.శినేకుమార్ మాట్లాడుతూ ఆవులకు పనస, పొరోటా, కంజి వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల లాక్టిక్ అసిడోసిస్ వ్యాధి సోకుతుందని, ఆ తర్వాత డీహైడ్రేషన్ కు గురై మరణిస్తారని తెలిపారు.  విషయం తెలుసుకున్న  మంత్రి జె.చించురాణి  సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.  పశుగ్రాసం అందించడంపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఆవులను కోల్పోయిన రైతుకు రూ. 50 వేల  నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.