షాద్ నగర్ లో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు..

షాద్ నగర్ లో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు..

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో పట్టపగలే దోపిడీకి పాల్పడ్డారు మహిళా దొంగలు. పట్టణంలోని లేడీస్ కార్నర్ లో మహిళ బ్యాగ్ నుంచి బంగారం కొట్టేశారు ఇద్దరు కిలాడీలు. బాలానగర్ మండలం సూరారం గ్రామానికి చెందిన భారతమ్మ తమ మనవరాలు పెళ్లి కోసం కొనుగోలు చేసిన గోల్డ్ బ్యాగులో పెట్టుకొని ... లేడీస్ కార్నర్ కు వెళ్లింది. 

ఇద్దరు మహిళా దొంగలు ఆమెను వెంబడించి బ్యాగులో బంగారం కొట్టేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు షాద్ నగర్ పోలీసులు.