కరోనా దెబ్బకు..కార్ఖానాలు బందైనయ్..!

కరోనా దెబ్బకు..కార్ఖానాలు బందైనయ్..!

ఆర్డర్లు వస్తలేవ్.. లేబర్ షార్టేజ్
కరెంటు బిల్లు లు కూడా కట్ట లేని దుస్థితి
మెషీన్లను అమ్మేస్తున్న యజమానులు
ఆదుకోని ప్రభుత్వం.. ప్రోత్సాహకాలు కరువు
బాలానగర్ కారిడార్లో ఒకప్పుడు
ప్రతి నెల రూ. 12 కోట్ల టర్నోవర్..
ఇప్పుడు రూ. 3 కోట్లు దాటుతలేదు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగు నెలలుగా మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీస్ (ఎంఎస్ఎంఈలు)లో పెద్దగా ప్రొడక్షన్లేదు. ఒకటొకటిగా కంపెనీలు మూతపడే పరిస్థితి వచ్చింది. కరోనా ఎఫెక్తో ట్ కంపెనీల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 55 వేల వరకు ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఇందులో సుమారు 15 లక్షల మంది వరకు పనిచేస్తుంటారు. ఎక్కువగా హైదరాబాద్ చుట్టు పక్కలనే ఈ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో ఇస్తార్లు, గుండు సూదులు తయారు చేసే చిన్న చిన్న పరిశ్రమలతో పాటు పెద్ద పెద్ద పనులకు అవసరమయ్యే టూల్స్ ను తయారు చేసే కంపెనీలూ ఉన్నాయి. కరోనా కట్టడి కోసం లాక్డౌన్ విధించడంతో మూతపడ్డ కంపెనీలన్నీ.. లాక్డౌన్ స‌డలింపులు ఇచ్చినా నిర్వహణ భారంతో 70 శాతంకంపెనీలు తెరుచుకోలేదు. తెరుచుకున్న కొన్ని కంపెనీల్లోనూ ఉత్పత్తి లేదు. ఆరర్్డ లురాకపోవడం, లేబర్లులేకపోవడంతో మెషీన్లచప్పుడు బందైంది. రోజులో 18 గంటలు నడిచే కొన్ని కంపెనీలు కనీసం మూడు గంటలు కూడా నడవడం లేదు.

దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న పారిశ్రామిక వాడల్లో బాలానగర్ – జీడిమెట్ల కారిడార్ ఒకటి. హైదరాబాద్ శివారులోని ఈ కారిడార్లో ఎంఎస్ ఎంఈ కంపెనీలు 900కు పైగా ఉంటాయి. వీటిలో దాదాపు 4వేల మంది జీవనోపాధి పొందుతుంటారు. ఇందులో ఒక్క లేబర్ తో నడిచే మైక్రో పరిశ్రమలూ ఉన్నాయి. ఒక్కో యూనిట్ లో కనీసం ముగ్గురు నుంచి ఐదుగురు ఉండే చిన్న పరిశ్రమల్లో ఓనర్ తోపాటు ఆపరేటర్, మరో ఇద్దరు లేబర్ పనిచేస్తే గానీ పని నడవదు. ఈ కారిడార్లో స్కిల్డ్లేబర్ 2 వేల మంది పని చేస్తుంటారు. వారితోపాటు 600 మంది వరకు అన్ స్కిల్డ్లేబర్ ఉంటారు. కానీ లాక్ డౌన్ లో పరిశ్రమలు మూసివేయడంతో కార్మికులకు పనిలేకుండా పోయింది. తర్వాత సడలింపులు ఇవ్వడంతో లేబర్ సొంతూళ్ల‌కు వెళ్లి పోయారు. దీంతో బాలానగర్, జీడిమెట్ల, ఫతేనగర్, గౌతంనగర్, అక్షయ్ ఎన్ క్లేవ్ ఇండస్ట్రీస్ క్ల‌స్ట‌ర్ల‌లో కంపెనీలు ఓపెన్ చేసినప్పటికీ పనులు సాగడం లేదు. ఉన్న కొద్ది మందితోనైనా నడిపించుకుందామంటే ఆర్డర్లు ఉండటం లేదు. ఇతర ప్రాంతాల్లోని ఇండస్ట్రియల్ ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రప్రభుత్వం నుంచి కూడా సాయం అందడం లేదని కంపెనీల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ సమస్యల పరిష్కారానికి ఆర్కథి ప్రోత్సాహకాలతో ఆదుకోవాలని కోరినా పట్టించుకునే దిక్కు లేదు.

ఆగిన ప్రొడక్షన్

బాలానగర్–జీడిమెట్ల ఇండస్ట్రియల్ కారిడార్ టర్నోవర్ ప్రతి నెల రూ.10 కోట్లనుంచి 12కోట్లకు పైనే ఉంటుంది. ఇక్కడ తయారయ్యే వస్తువులను బీహెచ్ఈఎల్, ఎన్ఆర్ఈఎస్, ప్రాగా టూల్స్, పఠాన్ చెరు, చెరప్లల్లి ఇండస్ట్రీ కారిడార్ లోని కంపెనీలు వాడుకుంటాయి. అయితే లాక్ డౌన్ నుంచి ఆయా కంపెనీల నుంచి వర్క్ ఆర్డర్లు ఆగిపోయినట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో వస్తువుల ప్రొడక్షన్ఆగిపోయిందని, ఇప్పుడు మొత్తంగా రూ.3 కోట్ల టర్నోవర్ కూడా దాటడం లేదని బాలానగర్–జీడిమెట్ల ఇండస్ట్రియల్ కారిడార్ లోని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం