హైదరాబాద్లో రూ.23కోట్ల విలువైన బంగారం, వెండి పట్టివేత

హైదరాబాద్లో రూ.23కోట్ల విలువైన బంగారం, వెండి పట్టివేత

హైదరాబాద్ నగరంలో ఎన్నికల దృష్ట్యా జరుగుతున్న తనిఖీల్లో భారీగా బంగారం, వెండి పట్టుబడింది. మాదాపూర్ SOTపోలీసు, RGI పోలీసులు సంయుక్తంగా వాహ నాల తనిఖీలు నిర్వహిస్తుండగా సరైన పత్రాలే లేకుండా 34.78 కిలల బంగారు నగలు, 43.60 కిలో వెండి  పట్టుకున్నారు. అనంతరం RGI పోలీస్ స్టేషన్ కు తరలిం చారు. 

పట్టుకున్న బంగారం , వెండి విలువ రూ. 23 కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు. విచారణలో భాగంగా బంగారం, వెండి ఆభరణాలను FST టీంకు అప్పగించారు.ఈ కేసులో ఇన్ కమ్ టాక్స్ అధికారులు వారి కోణంలో విచారణ చేపట్టారు. ఈ బంగారం, వెండి ఆభరణాలను GMR Domestic AiR Cargo ద్వారా ముంబై నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణ లో తేలింది. Naplog Logistic, Marudhar Express & Maa Bhavaani Logistic services ద్వారా ఈ బంగారం, వెండి ఆభరణాలను అక్రమ రవాణా చేస్తున్నట్లు విచారణ లో తేలింది.