
కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి జిల్లాలో సూర్యుడు భగభగమంటున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం రామారెడ్డి మండల కేంద్రంలో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో జిల్లాలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కాగా.. బిచ్కుందలో 44.7, దోమకొండలో 44.6, పాతరాజంపేట ( కామారెడ్డి), కొల్లూర్‌లో 44.2, డొంగ్లిలో 44, తాడ్వాయి, ఆర్గొండల్లో 43.9, భిక్కనూరులో 43.8, బీర్కూర్‌లో 43.7, వెల్పుగొండ, హాసన్పల్లిల్లో 43.6, సదాశివనగర్, పిట్లం, నస్రుల్లాబాద్ల్లో 43.5, బీబీపేటలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.