రాష్ట్రంలో ‘ఈజీ మనీ’ పాలసీ నడుస్తోంది : బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్

రాష్ట్రంలో ‘ఈజీ మనీ’ పాలసీ నడుస్తోంది : బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్
  • పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎన్వీ సుభాశ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాయమైందని..దాని స్థానంలో ఇప్పుడు కాంగ్రెస్ మార్క్ ‘ఈజీ వే ఆఫ్ మేకింగ్ మనీ’ పాలసీ నడుస్తోందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం నేరాలకు అడ్డాగా మారిందని, శాంతిభద్రతలు పూర్తిగా గాలికి వదిలేశారని ఆరోపించారు. బుధవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖను తన వద్దే ఉంచుకుని కేవలం పార్టీ ఫిరాయింపులు, రాజకీయ వ్యూహాలపైనే దృష్టి పెడుతున్నారని ఎద్దేవా చేశారు. 

సెలెక్టివ్ యాక్షన్​తో పేరెంట్స్ తమ పిల్లలను డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియక ఏడుస్తుంటే.. బీఆర్ఎస్ నేతలు ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో డ్రగ్స్​ పార్టీలతో ఎంజాయ్ చేయడం సిగ్గుచేటన్నారు. గ్లోబల్ సమిట్లలో లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నామని చెప్పుకుంటున్న సర్కార్.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి పెట్టుబడి కూడా ఎందుకు తీసుకురాలేదని సుభాశ్ ప్రశ్నించారు.