రాహుల్, ప్రియాంకతో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భేటీ

రాహుల్, ప్రియాంకతో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భేటీ
  •     రాష్ట్ర రాజకీయాలు, బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చర్చ
  •     పాల్గొన్న పీసీసీ చీఫ్, ఎంపీలు 

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని సీఎం రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం ఉదయం 11:20 గంటలకు  పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో కలిసి సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి పార్లమెంట్‌‌‌‌కు చేరుకున్నారు. ఆయనకు ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్  ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, రాజ్య సభకు కొత్తగా ఎన్నికైన వేం నరేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఇతర ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం పార్లమెంట్‌‌‌‌లోని ఎంపీల క్యాంటీన్‌‌‌‌లో  పాత మిత్రులైన పలు రాష్ట్రాలకు చెందిన ఎంపీలను సీఎం పలకరించారు.  

పార్లమెంట్‌‌‌‌లో రాహుల్ గాంధీని ఆయన చాంబర్‌‌‌‌‌‌‌‌లో కలిశారు. రాజ్యసభకు కొత్తగా ఎంపికైన వేం నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డిని పరిచయం చేశారు. దాదాపు 10 నిమిషాలపాటు సీఎం, పీసీసీ చీఫ్ సహా ఎంపీలతో రాహుల్ గాంధీ మాట్లాడారు.  రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్ర బడ్జెట్, గిగ్ వర్కర్ల బిల్లు, ఇతర అంశాలపై చర్చించారు. ఆ తర్వాత మకర ద్వారం సమీపంలో ప్రియాంక గాంధీని సీఎం కలిశారు. తెలంగాణలో సమర్థవంతమైన పాలన, ఇతర అంశాలపై సీఎంను ప్రియాంక గాంధీ అభినందించారు. అనంతరం వేం నరేందర్ రెడ్డిని సీఎం పరిచయం చేశారు. 

అంతకు ముందు  తనకు పెద్దల సభకు  అవకాశం కల్పించిన రాహుల్, ప్రియాంక గాంధీకి వేం నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.  ఏప్రిల్ 10న లేదా ఆ తర్వాత రాజ్య సభ సభ్యుడిగా ప్రమాణం చేయనున్నట్టు చెప్పారు. సీఎం వెంట  ఎంపీలు మల్లు రవి, సురేశ్‌‌‌‌షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌ యాదవ్, చామల కిరణ్‌‌‌‌కుమార్‌‌‌‌ రెడ్డి, కాంగ్రెస్‌‌‌‌ నేత రోహిన్ రెడ్డి ఉన్నారు. కాగా, సీఎం తన ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరారు.

రేవంత్‌‌‌‌ను పలకరించిన రోజా 

పార్లమెంట్ ఆవరణలో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని ఏపీ మాజీ మంత్రి, సినీ నటి రోజా మర్యాదపూర్వకంగా పలకరించారు. పార్టీ అగ్రనేతలను కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పార్లమెంట్‌‌‌‌కు రాగా.. అదే సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసేందుకు వైఎస్సార్ సీపీ పార్టీ ఎంపీలతో కలిసి రోజా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో అనుకోకుండా ఈ ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురుపడ్డారు. 

షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కుషల ప్రశ్నలు వేసుకున్నారు.  మీటింగ్‌‌‌‌లు ముగిసిన తర్వాత పార్లమెంట్ మకర ద్వారం వద్ద రెండోసారి యాదృచ్ఛికంగా మళ్లీ కలిశారు. ఈ సందర్భంగా మరోసారి ఇద్దరూ పలకరించుకొని.. మళ్లీ కలుద్దాం అంటూ సెలవుతీసుకున్నారు.