దేవకీ నందన వాసుదేవ మూవీ నుండి ఫస్ట్  సాంగ్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

దేవకీ నందన వాసుదేవ మూవీ నుండి ఫస్ట్  సాంగ్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

‘హీరో’ చిత్రంతో  టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా.. తన రెండో సినిమాగా ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రంలో నటిస్తున్నాడు. ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్‌‌‌‌‌‌‌‌ వర్మ కథను అందించాడు.  వారణాసి మానస హీరోయిన్. శుక్రవారం ఈ చిత్రం నుంచి ఫస్ట్  సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘ఏమయ్యిందే గుండెకు.. ఏనాడు లేదే ఇంత ఉలుకు.. నీ వల్లే కాదని అనకు.. ఏమయ్యిందో తెలిసే వరకు’ అంటూ సాగిన ప్రేమ పాట సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ పాటకు సురేష్ గంగుల క్యాచీ లిరిక్స్ రాయగా.. ఈశ్వర్ దత్ పాడాడు. ‘ఏం చేశావే నన్ను.. చూస్తూనే ఉన్నాలే నిన్ను.. చూపైనా తిప్పుకోలేను.. ఏం చేశావో తెలిపేవరకు.. ’  అంటూ హీరోయిన్ మానస వెంట పడుతూ కనిపిస్తున్నాడు అశోక్. వీరిద్దరి మధ్య  లవ్ ట్రాక్‌‌‌‌‌‌‌‌  ప్లెజెంట్‌‌‌‌‌‌‌‌గా ఉంది.  అజయ్ కొరియోగ్రఫీలో అశోక్ గల్లా చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేయనున్నారు.