జూన్, జూలైలో కరోనా గరిష్ట స్థాయికి చేరే అవకాశాలున్నాయి: రణదీప్ గులేరియా

జూన్, జూలైలో కరోనా గరిష్ట స్థాయికి చేరే అవకాశాలున్నాయి: రణదీప్ గులేరియా

కరోనా వైరస్ వ్యాప్తి కేసులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రెండు వారాల కిందటి వరకు రోజుకు వెయ్యి కేసులు నమోదవుతుండగా… ఇప్పుడు రోజుకు 3 వేల కేసుల వరకు బయటపడుతున్నాయి. ఈ పరిస్థితిపై ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. జూన్, జూలై మాసాల్లో దేశంలో కరోనా గరిష్ట స్థాయికి చేరే అవకాశాలున్నాయని తేల్చిచెప్పారు. అందుబాటులో ఉన్న అంచనాలు, సమాచారం, పెరుగుతున్న కేసుల సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో కరోనా వ్యాప్తి మరింత పెరుగుతుందన్నారు.

భారత్ లో లాక్ డౌన్ పొడిగింపు ప్రభావం కరోనా వ్యాప్తిపై ఎంతవరకు పనిచేసిందనేది కూడా మరికొన్ని రోజులు గడిస్తే కానీ చెప్పలేమన్నారు రణదీప్ గులేరియా.