స్కూల్స్ రీఓపెన్‌కు సరైన టైమ్ కాదు: సిద్ధరామయ్య

స్కూల్స్ రీఓపెన్‌కు సరైన టైమ్ కాదు: సిద్ధరామయ్య

బెంగళూరు: కర్నాటకలో స్కూళ్లను రీఓపెన్ చేయడానికి ఇది సరైన సమయం కాదని మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య అన్నారు. ప్రస్తుతం కరోనా ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉన్నందున ఇంకో రెండు నెలల వరకు స్కూల్స్ ను తెరవొద్దని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి విపరీత నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం బీఎస్ యడ్యూరప్పతోపాటు ఆ రాష్ట్ర ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్ కుమార్‌‌కు సలహా ఇచ్చారు. జూలైలో స్కూళ్లు తెరవాలన్న మంత్రి సురేష్ ప్రపోజల్‌పై ఆందోళన చెందుతున్న పేరెంట్స్ గురించి ఆలోచించాలన్నారు. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాల్లో పాఠశాలలను తిరిగి తెరిచాక స్టూడెంట్స్ కరోనా బారిన పడుతున్నట్లు నివేదికలు వచ్చాయని గుర్తు చేశారు.

కాగా, తన వ్యాఖ్యలపై కర్నాటక వ్యాప్తంగా చాలా మంది పేరెంట్స్ ఆందోళనలు వ్యక్తం చేయడంతో వెనక్కితగ్గిన మినిస్టర్ సురేష్ కుమార్.. స్కూళ్ల రీఓపెన్‌పై సర్కార్ ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోబోదని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రీసెంట్‌గా విడుదల చేసిన గైడ్ లైన్స్ లో.. స్కూళ్లు, కాలేజీలు, ట్రెయినింగ్‌తోపాటు కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ విషయంలో పేరెంట్స్, స్టేక్ హోల్డర్స్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని, వాటి ఆధారంగా రీఓపెన్ చేయొచ్చని స్టేట్ గవర్నమెంట్స్‌కు సూచించింది.