లాక్ డౌన్ ఎఫెక్ట్ : 18.5లక్షల అబార్షన్లు జరిగాయి

లాక్ డౌన్ ఎఫెక్ట్ : 18.5లక్షల అబార్షన్లు జరిగాయి

ఐపాస్ డెవలప్ మెంట్ ఫౌండేషన్ సంస్థ మనదేశంలోని గర్భిణీలకు సురక్షిత, చట్టబద్ధమైన అబార్షన్ల గురించి అవగాహన కల్పిస్తుంది. అయితే తాజాగా ఆ సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో దిగ్భాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దేశంలో దశలవారీగా లాక్ డౌన్ విధించడం వల్ల మహిళల్లో అబార్షన్ లు పెరిగినట్లు తెలుస్తోంది.మార్చి 25 నుంచి మే 3 వరకు విధించిన లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా 18.5 లక్షల అబార్షన్‌లు గైనకాలజిస్ట్‌ సలహా లేకుండానే జరిగాయని సర్వేలో తేలింది.  దేశ వ్యాప్తంగా ఉన్న డాక్టర్లు కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ అందిస్తున్నారని దీంతో 18.5 లక్షల మంది గర్భిణీ మహిళలకు అవసరమైన సౌకర్యాలు లేవని.. దీంతో సురక్షితమైన గర్భస్రావం వంటి సేవలకు అంతరాయం కలిగిందన్నారు ఐపాస్ డెవలప్ మెంట్ ఫౌండేషన్ సీఈఓ వినోజ్‌ మానింగ్‌.

సురక్షితమైన గర్భస్రావ సేవలను కోరుకునే మహిళలను లాక్‌ డౌన్‌ ఆంక్షలు ఎలా ప్రభావితం చేశాయో తెలపడమే గాక.. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఈ విషయంలో దృష్టి కేంద్రీకరించేందుకు వీలుగా ఈ అధ్యయనం జరిగింది అని వినోజ్‌ మానింగ్‌ తెలిపారు.