ఫేక్ యూఆర్ఎల్ లింక్స్ పంపి .. డేటా దోచేస్తరు

ఫేక్ యూఆర్ఎల్ లింక్స్ పంపి .. డేటా దోచేస్తరు
  • సెర్చ్‌‌‌‌ ఇంజిన్‌‌‌‌లో నకిలీ వెబ్ సైట్ల మాయ
  • గూగుల్‌‌‌‌, బింగ్‌‌‌‌  సెర్చ్​లో ఫేక్ యూఆర్‌‌‌‌‌‌‌‌ఎల్స్
  • క్లిక్ చేసిన వెంటనే మాల్‌‌‌‌వేర్, స్పైవేర్‌‌‌‌‌‌‌‌తో  స్మార్ట్​ఫోన్, సిస్టమ్ హ్యాకింగ్
  • అలర్ట్​గా ఉండాలంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : ఈ – కామర్స్ వెబ్​సైట్లకు ఫేక్ వెబ్ పేజ్​ను క్రియేట్ చేసి మాల్ వేర్​తో అటాక్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు.  ఇంటర్నెట్ సెర్చ్‌‌‌‌ ఇంజన్​లో ఫేక్‌‌‌‌ యూఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌(యూనిఫామ్‌‌‌‌ రీసోర్స్‌‌‌‌ లొకేటర్‌‌‌‌‌‌‌‌) క్రియేట్‌‌‌‌ చేసి హ్యాకింగ్‌‌‌‌, మాల్‌‌‌‌వేర్ తో‌‌‌‌ సైబర్ దాడులు చేస్తున్నారు. అక్షరం మార్చి ఫేక్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్స్‌‌‌‌ తయారు చేస్తున్నారు. ఒరిజినల్‌‌‌‌ సైట్స్​లాగా వెబ్‌‌‌‌పేజ్‌‌‌‌ సహా ఫీచర్స్​ను కూడా కాపీ చేస్తున్నారు. నెటిజన్లు ఏ మాత్రం గుర్తించలేని విధంగా ఫేక్ యూఆర్‌‌‌‌‌‌‌‌ఎల్​ను ప్రిపేర్ చేస్తున్నారు. వీటిని గూగుల్‌‌‌‌, బింగ్‌‌‌‌ సహా ప్రముఖ సెర్చ్‌‌‌‌ ఇంజిన్లలో అందుబాటులో పెడుతున్నారు.

అక్షరం మార్చి..

గూగుల్‌‌‌‌ సెర్చ్‌‌‌‌ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. ఎలాంటి సమాచారం కావాలన్నా సరే గూగుల్‌‌‌‌లోకి వెళ్లి సెర్చ్‌‌‌‌ చేస్తుంటాం. దీంతో మనం చేసిన ఎంట్రీకి సంబంధించిన అక్షరా
లకు సంబంధించి వందల సంఖ్యలో వెబ్‌‌‌‌ పేజెస్‌‌‌‌ సమాచారం వస్తుంది. వీటిలో అక్షరం తేడాతో సైబర్ నేరగాళ్లు క్రియేట్‌‌‌‌ చేసిన ఫేక్‌‌‌‌ యూఆర్‌‌‌‌‌‌‌‌
ఎల్స్‌‌‌‌ కూడా ఉంటాయి. ఒరిజినల్‌‌‌‌ యూఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌ ఏదో నకిలీదేదో గుర్తించలేనంతగా డిజైన్ చేస్తున్నారు.

https:// తో మొదలైతేనే ఒరిజినల్‌‌‌‌

ప్రధానంగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌,ఈ– కామర్స్‌‌‌‌ సైట్స్​నే సైబర్ నేరగాళ్లు టార్గెట్‌‌‌‌ చేశారు. https:// యూఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌లో కంటికి కనిపించని మార్పులు చేసి ఫేక్‌‌‌‌ యూఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌ను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పెడుతున్నారు. ప్రముఖ ఈ–  కామర్స్‌‌‌‌ సైట్స్​తో పాటు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ట్రాన్జాక్షన్స్‌‌‌‌ జరిగే ప్రతి వెబ్‌‌‌‌సైట్స్​కు సంబంధించిన వెబ్‌‌‌‌ పేజెస్‌‌‌‌ రూపొందిస్తున్నారు. ఇలాంటి యూఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌ను క్లిక్ చేసిన వెంటనే మాల్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌, స్పై వేర్‌‌‌‌‌‌‌‌లు అటాక్ చేసేలా లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నారు.

సర్వర్, నెట్ వర్కింగ్ సిస్టమ్ హ్యాక్

ఫేక్ యూఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌తో మాల్‌‌‌‌వేర్​ను పంపి కంపెనీల  సర్వర్‌‌‌‌‌‌‌‌, కంప్యూటర్స్‌‌‌‌, నెట్‌‌‌‌వర్కింగ్ సిస్టమ్‌‌‌‌ను హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. మాల్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌తో పాటు స్పైవేర్‌‌‌‌ అటాక్స్​తో ఆన్‌‌‌‌లైన్ దోపిడీకి పాల్పడుతున్నారు.వెబ్ బ్రౌజింగ్ హిస్టరీ, పాస్‌‌‌‌వర్డ్స్‌‌‌‌, ఈ– మెయిల్ ఐడీ, క్రెడిట్,డెబిట్‌‌‌‌ కార్డ్ నంబర్స్‌‌‌‌, పర్సనల్‌‌‌‌ డేటాతో పాటు బ్యాంకింగ్ రికార్డులకు సంబంధించిన సమాచారం దోపిడీ చేస్తారు. సెల్ ఫోన్లు, కంప్యూటర్‌‌‌‌‌‌‌‌ సర్వర్స్​ను తమ ఆధీనంలోకి తీసుకుంటారు. వీటితో ఆన్ లైన్​లో అందినంతా దోచేస్తరు.

లింక్స్ ను క్లిక్ చేసే ముందు చెక్ చేసుకోవాలి ఒరిజినల్ యూఆర్ఎల్ 

https://accounts.google.com తో మొదలవుతాయి. ఇలా లేని యూఆర్‌‌‌‌‌‌‌‌ఎల్స్‌‌‌‌ ను ఫేక్ గా అనుమానించాలి. ప్రస్తుతం సోషల్‌‌‌‌ మీడియాలో కూడా ఇలాంటి లింక్స్ సర్క్యులేట్‌‌‌‌ అవుతున్నాయి. క్లిక్ చేసే ముందు యూఆర్ఎల్​ను పరిశీలించాలి. సెర్చ్‌‌‌‌ ఇంజిన్‌‌‌‌లో అలర్ట్​గా ఉండాలి. ఎలాంటి మోసం జరిగినా వెంటనే  1930కి కాల్‌‌‌‌ చేయాలి. 

– కేవీఎం ప్రసాద్, డీఎస్పీ, టీఎస్ సైబర్ క్రైమ్ బ్యూరో