ఎంపీల తీరుతో మనస్తాపం చెందా

ఎంపీల తీరుతో మనస్తాపం చెందా

న్యూఢిల్లీ: రాజ్యసభలోనూ గందరగోళం కొనసాగుతోంది. సభ మొదలైన వెంటనే విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. పెగాసస్‌పై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో సభ్యుల తీరుపై రాజ్యసభ్య ఛైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల తీరుతో మనస్తాపం చెందానని, ఈ ప్రవర్తన సరికాదన్నారు. సభ్యులు ఎందుకు సహకరించడంలేదో అర్థం కావడం లేదన్నారు. 
పార్లమెంట్‌ను స్తంభింపజేస్తే లాభమేంటని వెంకయ్య ప్రశించారు. సభకు సహకరిస్తామని అఖిలపక్ష సమావేశంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సభ్యుల ప్రవర్తన నిరాశపరిచిందని మండిపడ్డారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సరికాదని ఫైర్ అయ్యారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75వ వసంతంలోకి అడుగుపెడుతున్నామని.. ఈ టైమ్ లో ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదన్నారు. స్వాతంత్ర్య స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. సభా సమావేశాలు సజావుగా సాగేలా సభ్యులందరూ సహకరించాలని కోరారు.