
టాలీవుడ్ బుల్లితెర స్టార్ యాంకర్ లాస్య(Lasya) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మామ, భర్త మంజునాథ్ తండ్రి మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుపుతూ లాస్య తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. "మిస్ యూ అంకుల్. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అంటూ రాసుకొచ్చింది. అలాగే మంజునాథ్ కూడా తన తండ్రిపై ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు.
‘‘ మీ భౌతిక ఉనికి ఇక్కడ లేకపోయినా..మీ ఆత్మ ఎల్లప్పుడూ మాతోనే ఉంటుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మిస్ యూ నాన్న’’ అని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చాడు. అంతేకాకుండా తండ్రి తో దిగిన కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. కానీ తండ్రి మృతికి గల కారణాలు తెలపలేదు. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకి కామెంట్ సెక్షన్ సైతం ఆఫ్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దీంతో నెటిజన్లు, ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ లాస్య, మంజునాథ్ దంపతులకు ధైర్యం చెబుతున్నారు.
యాంకర్ లాస్య విషయానికి వస్తే..
యాంకర్ లాస్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెర మీద యాంకర్‌గా రాణిస్తూనే..తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి వెళ్లి..బిగ్ బాస్ ప్రేక్షకులకు, తన ఫ్యాన్స్ కి మరింత దగ్గరయ్యింది. అప్పుడప్పుడు వీలు కుదిరితే..అడపాదడపా షోలలో కనిపిస్తున్నప్పటికి..పూర్తి సమయం మాత్రం ఫ్యామిలీకే కేటాయిస్తుంది. అయితే లాస్య బుల్లితెరకు దూరమయినా..సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. అలాగే యూట్యూబ్ చానెల్‌లో వీడియోలు అప్లోడ్ చేస్తూ..చాలా బిజీగా ఉంటుంది. 2017లో మంజునాథ్‌ను లాస్య ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.