రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు : మోహన్ భగవత్

రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు : మోహన్ భగవత్

రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమంటూ ఓ వీడియో వైరల్ అవుతోందని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అవసరం ఉన్నంత వరకు వాటిని కొనసాగించాల్సిందేనని చెప్పారు. హైదరాబాద్ లోని నాదరుల్లో ఆయన మాట్లాడుతూ..   సమాజంలో బేధ భావాలు పోయే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందే. ఆర్ఎస్ఎస్ పై  దుష్ప్రచారం చేస్తున్నా రు. ఏఐ ఉపయోగించి తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నరు. సమాజంలో వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాను మంచి కోసం వాడాలి అని హితవు పలికారు. రాజ్యాంగం ప్రకారం అమల్లో ఉన్న రిజ‌ర్వేష‌న్లకు తామెన్నడూ వ్యతిరేకంగా మాట్లాడ‌లేదన్నారు.