వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు

వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు

మేషం

అనుకూల సమయమే. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. అప్పుల బాధలు తొలగుతాయి. ముఖ్య కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. గృహయోగం. వ్యాపారులు పెట్టుబడులు సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. పారిశ్రామికవేత్తలకు అరుదైన ఆహ్వానాలు. వారారంభంలో అనుకోని ప్రయాణాలు.

వృషభం

కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. సన్నిహితులు, స్నేహితులతో ఉత్సాహవంతంగా గడుపుతారు. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ముఖ్య కార్యాలు విజయవంతంగా సాగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. శత్రు విజయం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. లాభాలు తథ్యం. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పరిశోధకులు, రాజకీయవేత్తలకు అవకాశాలు పెరుగుతాయి.

మిథునం

కొత్త కార్యాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖుల నుంచి కీలక  సమాచారం. బంధువుల సూచనలు పాటిస్తారు. రాబడి సంతృప్తికరం. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు దక్కుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉత్సవాలు, వేడుకలకు హాజరవుతారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు రావచ్చు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, సాంకేతిక నిపుణులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

కర్కాటకం

పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులు, బంధువులతో తగాదాలు పరిష్కారం. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. నిరుద్యోగుల జీవితాశయం నెరవేరుతుంది. ముఖ్య కార్యాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆదాయం ఆశాజనకం. వాహనసౌఖ్యం. వివాహ, ఉద్యోగ ప్రయత్నాల్లోపురోగతి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారులకు లాభాలు సంతోషాన్నిస్తాయి. ఉద్యోగులకు మరింత సానుకూలమైన కాలం. రాజకీయవేత్తలు, కళాకారులకు అంచనాలు నిజమవుతాయి. 

సింహం

ఆదాయానికి మించిన ఖర్చులు. ఆలోచనలు నిలకడగా సాగవు. అనుకున్న కార్యాలలో ఆటంకాలు. బంధువర్గంతో తగాదాలు. స్థిరాస్తి విషయంలో చికాకులు. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. సోదరుల నుంచి ఒత్తిళ్లు ఎదురైనా అధిగమిస్తారు. ఒక శుభవార్త అందుతుంది. వ్యాపారులకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా స్వల్ప లాభాలు. ఉద్యోగులకు విధులు కత్తిమీద సాముగా మారవచ్చు. పరిశోధకులు, కళాకారులు, సాంకేతిక నిపుణులకు కొత్త  సమస్యలు.  వారం మధ్యలో వాహనయోగం. ధనలబ్ధి.

కన్య

రాబడి అనుకూలం. ముఖ్య కార్యాలలో అవరోధాలు తొలగుతాయి. బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి అగ్రిమెంట్లు చేసుకుంటారు. తల్లి తరఫు నుంచి ధనలాభ సూచన. ఉద్యోగయత్నాలు సానుకూలం. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారు లకు కొత్త భాగస్వాముల నుంచి పెట్టుబడులు అందు తాయి. ఉద్యోగులు విధుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. కళాకారులు, సాంకేతిక నిపుణులకు నూతనోత్సాహం.  వారాంతంలో అనుకోని  ప్రయాణాలు.

తుల

కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు. అనుకున్న రాబడి దక్కుతుంది. బాకీలు వసూలవుతాయి. చేపట్టిన కార్యాలు విజయవంతం. కుటుంబంలో  సందడి వాతావరణం. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు లభించే సమయం. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలకు మరింత అనుకూల పరిస్థితులు.

వృశ్చికం

చేపట్టిన కార్యాలలో ఆటంకాలు అధిగమించి పూర్తి చేస్తారు. ఆదాయం ఆశాజనకం. అప్పులు తీరతాయి. విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు. బంధువులతో సఖ్యత. ఆస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు. చేజారిన వస్తువులు తిరిగి దక్కుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు విధి నిర్వ హణలో సత్తా చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి. వారం మధ్యలో కొన్ని నిర్ణయాలలో మార్పులు.

ధనుస్సు

సానుకూల వాతావరణంలో ముఖ్య కార్యాలు చక్కదిద్దుతారు. ఆరోగ్య సమస్యలు కొంత తీరతాయి.  శ్రేయోభిలాషుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. మీ నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆదాయం మరింత మెరుగ్గా ఉంటుంది. పదిమందిలో గౌరవం పెరుగుతుంది. పరిచయాలు విస్తృతమవుతాయి. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. వ్యాపారులు పురోగతి సాధిస్తారు. ఉద్యోగులు కొన్ని  సమస్యల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది.

మకరం

రాబడి సంతృప్తినిస్తుంది. నిరుద్యోగులకు ఆసక్తికర సమాచారం అందుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. ముఖ్య కార్యాలు విజయవంతంగా సాగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. గృహ నిర్మాణాలు చేపట్టే వీలుంది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులతో పాటు భాగస్వాములు లభిస్తారు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి.

కుంభం

ముఖ్యమైన కార్యాలు సమయానికి పూర్తి. రాబడి మొదట్లో ఇబ్బంది కలిగించినా క్రమేపీ ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. బంధువుల నుంచి ఆహ్వానాలు. శత్రువులు స్నేహితులుగా మారతారు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారులు ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు ఉత్సాహాన్నిస్తాయి. కళాకారులు, పరిశోధకులకు అప్రయత్న కార్యసిద్ధి.

మీనం

కొన్ని ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా వాటిని అధిగమిస్తారు. ఆదాయానికి లోటు ఉండదు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన కార్యాలు సజావుగానే సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. బంధువులు,స్నేహితులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారులకు లాభాలు దక్కే ఛాన్స్‌. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400