
గుజరాత్ భారీ అగ్నిప్రమాదం జరిగింది. నడియాడ్ మార్కెట్ ప్రాంతంలోని షాపులో ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో చుట్టు ప్రక్కల ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిప్రమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక అధికారి దీక్షిత్ పటేల్ మాట్లాడుతూ.. "నడియాడ్‌లోని అహ్మదాబాద్ ప్రాంతంలో 3 షాపులకు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు కార్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. విచారణలో, షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు అని తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
#WATCH | Gujarat: A fire broke out at a market in Nadiad. Firefighting operation underway. pic.twitter.com/zQovTlObur
— ANI (@ANI) April 28, 2024