వారఫలాలు ( మార్చి 8–14 ): జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వారంలో కొన్ని రాశుల వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. మరి 2026 సంవత్సరంలో మార్చి 08 నుంచి మార్చి 14 వరకు ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. . !
మేష రాశి: ఈ రాశి వారు ఈ వారంలో ఎక్కువుగా శుభవార్తలు వినే అవకాశం ఉంది. దగ్గరి బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వృత్తి.. వ్యాపారాలు లాభాల దిశగా ఉంటాయి. అనుకోకుండా ధనలాభం కలుగుతాయి. ఉద్యోగస్తులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు. వేతనం పెరిగేందుకు అవకాశం ఉంది. నిరుద్యోగులు కొత్త ఆఫర్లు అందుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలు చదువుల్లో పురోగతి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపో తాయి.
వృషభరాశి : ఈ రాశి వారికి ఈ వారం పని భారం పెరుగుతుంది. గతంలో చేపట్టిన పనులు అర్ధాంతరంగా ముగిస్తారు. ముందు కొంత నిరుత్సాహం చెందినా.. ఆ తరువాత అది మీ మంచికే జరుగుతుంది. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. మీ శత్రువులు మిమ్మలను తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఆఫీసులో ఉన్నతాధికారులనుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జీవితభాగస్వామిని సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.
మిథునరాశి : ఈ వారం ఈ రాశి వారికి అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా మెరుగుపడే అవకాశం ఉండటంతో అప్పుల సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. వృత్తి... వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరియాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
కర్కాటకరాశి :ఈ వారం ఈరాశి వారికి ఆర్థికంగా ఆశించిన ఫలితాలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి. స్థిరాస్థికి సంబంధించి కొత్త ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. దుబారా ఖర్చులు పెరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్తగా ఆదాయ మార్గాలకు శ్రీకారం చుడతారు. జాబ్ మారేందుకు ఇది అనుకూలమైన సమయంం. వ్యాపారస్తులు లాభాలు గడిస్తారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
సింహ రాశి : ఈ రాశి వారికి ఈ వారంలో మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి అనుకోకుండా పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది. స్నేహితుల సహాయంతో కొన్ని విషయాలు చక్కపడతాయి. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలకు సంబంధించి పురోగతి ఉంటుంది. కొత్తగా వాహనం కొనేందుకు అవకాశాలున్నాయి. నిరుద్యోగులు గుడ్న్యూస్ వింటారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడి పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రేమ వ్యవహారాలను వాయిదావేయడం చాలా మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కన్య రాశి :ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా బాగుంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు కలుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభించే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు కలసివస్తాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
తులా రాశి : ఈ రాశి వారికి ఈ వారం కుటుంబసభ్యుల మద్దతు పుష్కలంగా ఉంటుంది. వారం మధ్యలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. జాబ్ హోల్డర్స్ కు అన్ని విధాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెడితే అనుకోని లాభాలు కలుగుతాయి. ప్రేమ..పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
వృశ్చికరాశి :ఈ రాశి వారు ఈ వారంలో సొంత పనులపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇంటా బయట.. అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించినజాబ్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. . ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.
ధనుస్సురాశి :ఈ రాశి వారికి ఈవారం అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. వృత్తి.. వ్యాపారాల్లో సామాన్య లాభాలుంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రేమ.. పెళ్లి విషయాలను వాయిదా వేసుకోండి. ఆధ్యాత్మిక చింతనతో గడపండి.. అంతా మంచే జరుగుతుంది.
మకరరాశి : ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కొంతమంది తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్త యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు .. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పూర్వీకుల ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇతరుల మాటలను పరిగణనలోకి తీసుకోకపోవడం చాలా మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కుంభ రాశి : ఈవారం ఈ రాశి వారికి అన్ని విధాల కలసి వస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. సహోద్యోగుల మద్దతు పుష్కలంగా ఉంటుంది. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కేరీర్ పరంగా ఊహించని మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు
మీనరాశి: ఈ రాశి వారికి ఈ మిశ్రమ ఫలితాలుంటాయి. ఏదో తెలియని ఆందోళన వేధిస్తుంది. వ్యాపారస్తులకు సామాన్యమైన లాభాలుంటాయి. కోర్టు వ్యవహారాలు కలసి వస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరగడం.. సహోద్యోగుల వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అనవసరంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. డబ్బును ఖర్చు చేసే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
