మహిళలకు విజయ్ పార్టీ బంపరాఫర్: నెలకు 2 వేల 500, ఫ్రీ బస్, పెళ్లికి 8 గ్రాముల గోల్డ్

మహిళలకు విజయ్ పార్టీ బంపరాఫర్: నెలకు 2 వేల 500, ఫ్రీ బస్, పెళ్లికి 8 గ్రాముల గోల్డ్

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తోంది. దీంతో గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీవీకే చీఫ్, యాక్టర్ విజయ్‎ మహిళలపై వరాల జల్లు కురిపించాడు. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) వేళ మహిళలకు పలు హామీలు ప్రకటించాడు. శనివారం (మార్చి 7) మహాబలిపురంలో తమిళగ వెట్రి కజగం మహిళా కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయ్ మాట్లాడుతూ.. తన టీవీకే పార్టీ అధికారంలోకి వస్తే మహిళల భద్రత కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ శాఖను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. వీటితో పాటు పలు హామీ ప్రకటించాడు.

విజయ్ ప్రకటించిన హామీల్లో ముఖ్యమైనవి:

  • తమిళనాడులో మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచితం-
  • 60 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.2500 ఇస్తాం
  • ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం ఆరు ఉచిత LPG సిలిండర్లు
  • ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం, పట్టు చీర-
  • మహిళలకు ఆర్థిక చేయూత కింద రూ.15 వేలు
  • రేషన్‌ షాపుల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ పంపిణీ
  • తమిళనాడులో జన్మించే ప్రతి బిడ్డకు ఉచిత బంగారు ఉంగరం 
  • విద్యార్థులకు సంవత్సరానికి రూ. 15,000 ఆర్థిక సహయం