బ్యాంక్ ఉద్యోగినంటూ భారీ మోసం.. రూ.2.80 కోట్ల లోన్ ఇప్పిస్తానని ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో లూటీ 

బ్యాంక్ ఉద్యోగినంటూ భారీ మోసం.. రూ.2.80 కోట్ల లోన్ ఇప్పిస్తానని ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో లూటీ 
  • రూ.10 లక్షలు, 190 గ్రాములతో పరారైన వ్యక్తి అరెస్ట్

పద్మారావు నగర్, వెలుగు: బ్యాంక్​ఉద్యోగిగా నమ్మించి భారీ లోన్ ఇప్పిస్తానని ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిని రామ్​గోపాల్​పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ నరసయ్య శనివారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. తుర్కపల్లి భరత్ సాయిచంద్ర అనే వ్యక్తి తనను ఐడీఎఫ్​సీ బ్యాంక్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. రాఖీ జైన్ అనే మహిళకు సుమారు రూ.2.80 కోట్ల లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. లోన్ ప్రాసెసింగ్ పేరుతో ఆమె నుంచి రూ.10.69 లక్షలు, అలాగే 190 గ్రాముల బంగారం తీసుకుని పరారయ్యాడు.

ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని శనివారం అంబర్​పేటలో అరెస్ట్ చేశారు. అతని నుంచి ఒక కారు, రూ.4 లక్షల నగదు, 160 గ్రాముల బంగారం, ఒక సెల్‌‌ఫోన్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో 8 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.