హైదరాబాద్, వెలుగు: కరోనాతో పేరెంట్స్ ను కోల్పోయిన, తల్లిదండ్రులలో ఒక్కరు దూరమైన స్టూడెంట్లు ట్యూషన్ ఫీజు చెల్లించకపోయినా.. వాళ్లకు యూనిఫాం, లెర్నింగ్ మెటీరియల్ లేకున్నా స్కూల్ నుంచి తొలగించొద్దని ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్ల మేనేజ్మెంట్లను పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. జీవో నంబర్ 75 ప్రకారం 2021–22 అకడమిక్ ఇయర్లో ఫీజులు పెంచొద్దని, స్టూడెంట్ల నుంచి నెలనెలానే ఫీజులు తీసుకోవాలని సూచించింది. రూల్స్ పాటించకపోతే గుర్తింపు రద్దు చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించింది. ఈ నెల ఫస్ట్ నుంచి ఫిజికల్ క్లాసులు ప్రారంభమవడంతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన మేనేజ్మెంట్లు, టీచర్లు, హెడ్మాస్టర్లు పాటించాల్సిన సూచనలను (ఎస్ఓపీ) మంగళవారం విడుదల చేశారు. స్కూళ్లలో ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని.. స్టూడెంట్లు, టీచర్లు మాస్కులు పెట్టుకోవాలని చెప్పారు. కరోనా కేసులు ఇంకా తగ్గలేదు కాబట్టి మళ్లీ ఆదేశాలు ఇచ్చేంతవరకూ బడుల్లో గేమ్స్, గ్రూప్ డిస్కషన్స్, స్కూల్ అసెంబ్లీ బంద్ చేయాలన్నారు. పిల్లలు బడులకు రాకుంటే పెనాల్టీ
వేయొద్దని చెప్పారు.
విద్యా శాఖ ఇచ్చిన ఇంకొన్ని సూచనలివే..
- చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవడం, శానిటైజర్ వాడటం.
- ఫిజికల్ అటెండెన్స్ తప్పనిసరి కాదు. వెనకబడిన స్టూడెంట్లపై హెడ్మాస్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.
- అవసరమైతే బ్రిడ్జి కోర్సులు పెట్టాలి. బడుల్లో ఫ్రెండ్లీ వాతావరణం కల్పించాలి.
- పెన్సిల్, పెన్, బుక్స్, ఫుడ్, వాటర్ బాటిల్స్, గ్లాసులు, ప్లేట్స్ తదితర వస్తువులేవీ షేర్ చేసుకోకుండా చూసుకోవాలి.
- కిచెన్ రూమ్, డైనింగ్ హాల్, డ్రింకింగ్ వాటర్ దగ్గర, బడుల్లోకి ఎంట్రీ, ఎగ్జిట్ టైమ్లో ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి.
- ట్రాన్స్‌పోర్ట్ టైమ్లో కరోనా రూల్స్ పాటించాలి. స్టూడెంట్కు బుక్స్ ఇవ్వాలి.
