ఇండియాలో ప్రస్తుతం IPL 2026 ఫీవర్ తారాస్థాయికి చేరుకుంది. ప్రతి సాయంత్రం మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంటే, సోషల్ మీడియాలో మాత్రం ఒక ఫోటో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా, టాలీవుడ్ దిగ్గజాలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్‌లతో కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు.
డిఫరెంట్ లీగ్.. సేమ్ టేబుల్!
ఒక ప్రైవేట్ పార్టీలో కలిసిన ఈ ముగ్గురు స్టార్స్, చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు ఫోజులిచ్చారు. ఈ అరుదైన ఫోటోలను పృథ్వీ షా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “Different league, same table” (లీగ్‌లు వేరైనా, టేబుల్ ఒక్కటే) అంటూ అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వేలల్లో లైకులు, కామెంట్లతో వైరల్ అవుతున్నాయి. సిల్వర్ స్క్రీన్ హీరోలు, క్రికెట్ హీరోలు ఇలా చిల్ అవ్వడం చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
అండగా నిలిచిన అగ్ర హీరోలు
గత కొంతకాలంగా పృథ్వీ షా తన ఫామ్ విషయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కించుకోవడానికి పృథ్వీ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ అంటే ఎంతో ఇష్టం ఉన్న వెంకటేష్, రామ్ చరణ్‌లు పృథ్వీని పలకరించి, అతని ఆటతీరును ప్రశంసించడమే కాకుండా, రాబోయే మ్యాచ్‌లలో సత్తా చాటాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు. అగ్ర హీరోల నుంచి అందిన ఈ ప్రోత్సాహం యువ ఆటగాడికి కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
బిజీలో హీరోలు
ఒకవైపు ఐపీఎల్ సందడి కొనసాగుతుండగా, మరోవైపు ఈ ఇద్దరు హీరోలు తమ కొత్త చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీ 'పెద్ది' (Peddi) షూటింగ్లో పాల్గొంటున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆదర్శ కుటుంబం' (Adarsha Kutumbam) చిత్రంతో వెంకటేష్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సినిమా షూటింగ్స్ నుండి విరామం దొరకడంతో, వీరు ఇలా క్రికెటర్లతో కలిసి సందడి చేయడం ఐపీఎల్ సీజన్‌కు మరింత గ్లామర్‌ను జోడించింది. మొత్తానికి, పృథ్వీ షా బ్యాట్‌తోనే కాదు, ఇలాంటి క్రేజీ ఫోటోలతోనూ వార్తల్లో నిలుస్తూ ట్రెండింగ్‌లో ఉన్నారు..

