ఆఫీసుల్లో సీట్​కు సీట్​కు మధ్య ఆరడుగుల దూరం

ఆఫీసుల్లో సీట్​కు సీట్​కు మధ్య ఆరడుగుల దూరం

న్యూఢిల్లీ :  కరోనా లాక్‌‌డౌన్ కాలంలో వర్క్ ప్లేసెస్‌‌లో అనుసరించాల్సిన గైడ్‌‌లైన్స్‌‌ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఐటీ, ఐటీ ఎనాబుల్డ్ సర్వీసెస్‌‌లకు, ఈకామర్స్ కంపెనీలకు ఈ తాజా గైడ్‌లైన్స్‌‌ ను జారీ చేసింది. 50 శాతం స్టాఫ్‌‌తోనే ఆఫీసులను రన్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. కొత్త గైడ్‌‌లైన్స్ ను అనుసరిస్తేనే.. ఆఫీసులను, ఫ్యాక్టరీలను తెరిచి ఆపరేషన్స్ ప్రారంభించాలని ఆదేశించింది. అన్ని వర్క్ ప్లేస్‌‌ల్లో ఈ లాక్‌‌డౌన్ కాలంలో శానిటైజర్స్ అందించాలని ప్రభుత్వం సూచించింది. టెంపరేచర్ స్క్రీనింగ్ చేసే అరేంజ్‌‌మెంట్స్ చేయాలని తెలిపింది. బయట నుంచి వచ్చే వర్కర్లకు, స్పెషల్ ట్రాన్స్‌‌ పోర్ట్‌‌ ను అరేంజ్ చేయాలని తెలిపింది. పబ్లిక్ ట్రాన్స్‌‌ పోర్ట్‌‌ ను పూర్తిగా తిరస్కరించాలని సూచించింది. 30–40 శాతం ప్యాసెంజర్ కెపాసిటీతోనే ఆఫీసు వెహికల్స్ ను కూడా అనుమతించాలని చెప్పింది. ప్రతి ఉద్యోగికి గేట్ వద్దనే థర్మల్ స్క్రీనింగ్ చేయడం తప్పనిసరి చేసింది. ఏదైనా వెహికల్ లేదా మెషినరీ ఆఫీసు పరిసర ప్రాంతాలకు ఎంటర్‌‌‌‌ అయినప్పుడు.. వాటిని పూర్తిగా శుభ్రపరచాలని అంది.  ఉద్యోగికి ఉద్యోగికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలని చెప్పింది.

మీటింగ్స్ నిషేధం...

సోషల్ డిస్టెన్సింగ్ విధానాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. రెండు షిఫ్ట్‌‌ లకు మధ్య ఒక గంట తేడా ఉండాలని.. అన్ని ఆఫీసులను శానిటైజ్ చేస్తూ ఉండాలని సూచించింది. మాన్యుఫాక్చరింగ్ సంస్థ అయితే.. రెండు షిఫ్ట్‌‌ లు కలవకుండా చూసుకోవాలని చెప్పింది. లంచ్ బ్రేక్‌‌లో కూడా ఉద్యోగులు సోషల్ డిస్టెన్సింగ్ అనుసరించాలని ఆదేశించింది