ఎల్​ఐసీ నిధులను స్టాక్ మార్కెట్​లో పెట్టొద్దు

ఎల్​ఐసీ నిధులను స్టాక్ మార్కెట్​లో పెట్టొద్దు

ముషీరాబాద్,వెలుగు:  ఎల్ఐసీ నిధులను స్టాక్ మార్కెట్ లో పెట్టొద్దని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు వి. రమేశ్ ​డిమాండ్​ చేశారు.  ఐపీఓ ద్వారా ఎల్ఐసీ వాటాల ఉపసంహరణ జీవితబీమా సంస్థకు మంచిది కాదని, కేవలం కేంద్రానికి నిధులు సమకూరుతాయే తప్ప పాలసీదారులకు ఏ రకమైన ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. ఎల్ఐసీలో వాటాలు ఉపసంహరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల 20వ మహాసభ ఇందిరాపార్క్ ఎల్ఐసీ బిల్డింగ్ లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 65 ఏండ్లుగా ఎల్ఐసీ పాలసీదారుల సేవలో ఉంటూ దేశానికి కావాల్సిన నిధులు సమకూరుస్తోందన్నారు.    కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఎంపీలను కలిసి మెమోరాండం ఇస్తామని తెలిపారు. 
సమావేశంలో కార్యదర్శి రమేశ్, శ్రీకాంత్, ట్రెజరర్ ​రవి, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రఘు, అభిశ్​ రెడ్డి, తిరుపతయ్య, శ్రీనివాస్, సుజాత, ఉద్యోగులు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.            -ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ , జాతీయ అధ్యక్షుడు రమేశ్​