ఇజ్రాయిల్‌కు ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ వార్నింగ్

ఇజ్రాయిల్‌కు ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ వార్నింగ్

ఇరాన్ , ఇజ్రాయిల్ మధ్య రోజురోజుకు యుద్ధ వాతావరణం ముదురుతుంది. ఇరాన్ నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయిల్ ను హెచ్చరించాడు. ఇరాన్ పై ఇజ్రాయిల్ అణుబాంబు దాడి చేయాడానికి సిద్ధంగా ఉందని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.  న్యూక్లియర్ బాంబ్ ప్రయోగించాలని ఇరాన్ కు లేదని, కానీ తమ దేశానికి ప్రమాదమని భావిస్తే కచ్చితంగా అణు బాంబు దాడి చేస్తామని ఇజ్రాయిల్ కు వార్నింగ్ ఇచ్చాడు.

కమల్ ఖర్రాజీ ఇరాన్ అణు సిద్ధాంతానికి ఇజ్రాయెల్ ద్వారా ముప్పు ఉందని భావించినట్లయితే, దానిలో మార్పు చేస్తామని తెలిపారు. అణ్వాయుధాల అభివృద్ధికి వ్యతిరేకంగా అయతుల్లా ఖమేనీ గతంలో ఫత్వా చేసినప్పటికీ, ఇరాన్ యొక్క అప్పటి ఇంటెలిజెన్స్ మంత్రి 2021లో బాహ్య ఒత్తిళ్లు, ప్రత్యేకించి పాశ్చాత్య దేశాల నుండి ఇరాన్ యొక్క అణు భంగిమను తిరిగి అంచనా వేయవచ్చని సూచించాడు.