వ్యాక్సిన్ అంటే ఏంటి?

వ్యాక్సిన్ అంటే ఏంటి?

ఇన్ఫెక్షన్ కలిగించే వైరస్ లేదా బ్యాక్టీరియాలు శరీరంలో ఉన్నప్పుడు వాటితో పోరాడుతుంది రోగ నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ సిస్టమ్). కానీ, మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ కంటే వైరస్ బలంగా ఉంటే అప్పుడు ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో వైరస్​, బ్యాక్టీరియాలను నిర్వీర్యం చేయడం కోసం బయటి నుంచి ఇమ్యూనిటీని వ్యాక్సిన్ రూపంలో శరీరం లోపలికి పంపుతారు. అలా వ్యాధి నిరోధక వ్యవస్థ వైరస్​, బ్యాక్టీరియాలతో ఫైట్​ చేసి వాటిని చంపేస్తుంది. ప్రతి మనిషిలో రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది.

మన శరీరమే వ్యాధినిరోధక శక్తిని తయారుచేసుకుంటుంది. తినే తిండి ద్వారా అది ఇమ్యూనిటీ పెంచుకుంటుంది. ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి హాని చేసే శత్రువులతో ఫైట్​ చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంటుంది. అలాంటిది కరోనా లాంటి బలమైన శత్రువు వంట్లో చేరితే దాంతో పోరాడేందుకు మనలో ఉన్న ఇమ్యూనిటీ సరిపోదు. అలాగని అటువంటి వైరస్​లను వెంటనే నాశనం చేయకపోతే ప్రాణాలకే ముప్పు. ఇలాంటప్పుడే వ్యాక్సినేషన్ కాపాడుతుంది. వ్యాక్సిన్ ద్వారా వైరస్​తో పోరాడే ఇమ్యూనిటీ వస్తుంది. అంత శక్తి వ్యాక్సిన్​కి ఎలా వస్తుంది? దాన్నెలా తయారుచేస్తారనే విషయాలు తెలుసుకోవాలి.

వ్యాక్సిన్ తయారీ అంత ఈజీ కాదు

ఏ వ్యాక్సిన్ అయినా డెవలప్ చేయడం అంత ఈజీ కాదు. ఒక వ్యాక్సిన్​ తయారుకావాలంటే దాదాపు ఏడాది కాలం పడుతుంది. ఆ తరువాత తయారుచేసిన వ్యాక్సిన్​ను ఎలుకల వంటి వాటి మీద ట్రయల్​ చేస్తారు. ప్రి – క్లినికల్ ట్రయల్స్ విజయవంతం​గా జరిగి, ఆ జంతువు చనిపోకుండా ఉంటే అప్పుడు ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే ఆ జంతువులో ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ ఎలా ఉన్నాయి? అని టెస్ట్ చేస్తారు.

అంతా బాగుందని తేల్చేందుకే రెండేండ్లు పడుతుంది. ఆ తర్వాతే మనుషుల మీద ప్రయోగానికి రెడీ అవుతారు. అప్పుడు చిన్న పిల్లల నుంచి ఆడ, మగ, మధ్యవయసు, ముసలి వాళ్లు... అంటూ రకరకాల వ్యక్తుల్ని సెలక్ట్​ చేసుకుంటారు. వాళ్లను మూడు నుంచి ఆరు నెలలు అబ్జర్వేషన్​లో ఉంచుతారు. ఆ తర్వాత ఎక్స్​పరిమెంట్​లో భాగంగా వాళ్లకు వ్యాక్సిన్ ఇస్తారు. అది పనిచేసిందా? లేదా? అనేది చెక్ చేయడానికి ఆరు నెలల నుంచి ఏడాది పైనే పడుతుంది. అక్కడి నుంచి వ్యాక్సిన్​ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలంటే ఇంకో ఐదారేండ్లు పట్టొచ్చు. అదే వ్యాక్సిన్ కనిపెట్టే ప్రాసెస్​ స్పీడ్​గా జరిగితే వ్యాక్సిన్​ వాడకంలోకి వచ్చేందుకు రెండు మూడేండ్లు పడుతుంది. వ్యాక్సిన్​ మార్కెట్లోకి వచ్చాక అందరికీ అందుబాటులోకి వస్తుంది.