డాక్టర్లకు రిజిస్ట్రేషన్ తిప్పలు.. గంటల తరబడి క్యూలో నిల్చుంటున్న వైద్యులు

డాక్టర్లకు రిజిస్ట్రేషన్  తిప్పలు.. గంటల తరబడి క్యూలో నిల్చుంటున్న వైద్యులు

హైదరాబాద్, వెలుగు: ఈ నెల చివర్లో మెడికల్ కౌన్సిల్‌‌‌‌కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, మెడికల్ కౌన్సిల్‌‌‌‌లో తమ రిజిస్ట్రేషన్లను డాక్టర్లు రెన్యువల్ చేసుకుంటున్నారు. దేశమంతా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్ జరుగుతున్నా.. మన స్టేట్ మెడికల్ కౌన్సిల్ మాత్రం ఇప్పటికీ ఆఫ్‌‌‌‌లైన్‌‌‌‌లోనే రిజిస్ట్రేషన్లు చేపడుతున్నది. ఇటీవల మెడికల్​ కౌన్సిల్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను మంత్రి హరీశ్‌‌‌‌  రావు ప్రారంభించినా, ఇప్పటి వరకూ ఆ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ డాక్టర్లకు అందుబాటులోకి రాలేదు. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి రిజిస్ట్రేషన్  రెన్యువల్స్‌‌‌‌ కోసం కోఠిలోని మెడికల్ కౌన్సిల్ ఆఫీసుకు డాక్టర్లు క్యూ కడుతున్నారు. కౌన్సిల్ వద్ద సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో డాక్టర్లు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్‌‌‌‌, రెన్యువల్స్‌‌‌‌కు వేలల్లో చార్జీలు వసూలు చేస్తూ, కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెన్యువల్స్‌‌‌‌కు ఈ నెల 20వ తేదీ వరకు గడువు ఉంది. ఇకనైనా కౌంటర్ల సంఖ్య పెంచాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.