దేశంలోనే ఫ‌స్ట్: కరోనా ప్రయోగాలకు DRDO మొబైల్ ల్యాబ్‌

దేశంలోనే ఫ‌స్ట్: కరోనా ప్రయోగాలకు DRDO మొబైల్ ల్యాబ్‌

హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్‌‌పై ప్రయోగాలు చేసేందుకు డీఆర్డీవో శాస్త్ర
వేత్తలు ఓ మొబైల్‌ ల్యాబ్‌ను రెడీ చేశారు. బయో సెఫ్టీలెవల్‌‌-3 (బీఎస్‌‌ఎల్‌‌–3) ప్రమాణాలతో రూపొందించిన ఈ ల్యాబ్‌లో కరోనా వైరస్‌‌కు వ్యాక్సిన్లు, మెడిసిన్‌ కనుగొనేందుకు ప్రయోగాలు చేయనున్నారు . కరోనా వైరస్‌ వృద్ధి(లైవ్‌ కల్చర్‌‌‌‌) చేయడానికి అవసరమైన టెక్నాలజీ ఈ ల్యాబ్‌లో ఉంది. వైరస్‌‌ను స్టడీ చేసి, దాని జన్యు క్రమాన్ని విశ్లేషిస్తారు. దీని ఆధారంగా కొత్త మందులు, వ్యాక్సిన్లు తయారు చేసి వైరస్‌‌పై ప్రయోగిస్తామని ల్యాబ్ డిజైనర్‌‌‌‌, నిమ్స్ రీసెర్చ్ డెవలప్‌‌మెంట్ వింగ్ హెడ్‌‌, డాక్టర్‌‌‌‌ మధుమోహన్‌‌రావు తెలిపారు.

దేశంలో ఇదే మొదటిది

ఇది దేశంలోనే తొలి బీఎస్‌‌ఎల్‌‌3 మొబైల్‌ ల్యాబ్‌ అని డాక్ట‌ర్ మధుమోహన్‌‌రావు తెలిపారు. ఈ ల్యాబ్‌లో కరోనాపై ప్రయోగాలు చేసేందుకు సంబంధిత శాఖలకు, సంస్థలకు అప్లై చేశామని ఆయన చెప్పారు. ఇందులో కరోనాతో పాటు, అన్నిరకాల వైరస్‌‌లపై ప్రయోగాలు చేయొచ్చన్నారు . భవిష్యత్తులో ఎక్కడైనా కొత్త వైరస్‌‌లు వస్తే ఈ ల్యాబ్‌ను అక్కడికే తీసుకెళ్లి అవసరమైన టెస్టులు చేయొచ్చన్నారు.సైనిక అవసరాలకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్‌‌లోని సనత్‌నగర్‌‌‌ ఈఎస్‌‌ఐ హాస్పిటల్‌‌లో నేడు(సోమవారం) ఈ ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. ల్యాబ్‌కు అవసరమైన ఇంజినీరింగ్‌ టెక్నాలజీని డీఆర్డీవో అందించగా, ఐకామ్‌‌, ఐక్లీన్‌‌ అనే సంస్థల హెల్ప్‌‌తో రెండు పెద్ద కంటేనర్ల‌లో దీన్ని రెడీ చేశారు.