ఆలయంలో డ్రెస్​ కోడ్.. ఎక్కడంటే?

ఆలయంలో డ్రెస్​ కోడ్.. ఎక్కడంటే?

రాజస్థాన్ రాష్ట్రం జైపుర్ కొలువైన జార్ఖండ్ మహాదేవ్ ఆలయ నిర్వాహకులు భక్తులకు డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టారు. పరమ శివుడు కొలువైన ఈ దేవాలయంలోకి ఫార్ట్, మినీ స్కర్ట్​లు, రిఫ్డ్ జీన్స్, ఫ్రాక్స్,  నైట్ డ్రెస్సులు  ధరించి రావద్దని ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రకటించారు.  ఇందుకు సంబంధించి ఆలయం బయట బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఏమేం దుస్తులు ధరించాలో.. ఏమేం కూడదో వివరాలు తెలిపారు. ట్రెడిషనల్​ దుస్తులు ధరించిన వారికి మాత్రమే ఆలయంలో ప్రవేశం ఉంటుందన్నారు. 

నిబంధనలు అతిక్రమించిన వారికి ఆలయ ప్రవేశం నిషేధం అని వెల్లడించారు.  జీన్స్​, చిరిగిన జీన్స్​, షర్ట్స్​ ధరించి ఆలయంలోకి రావడంపై భక్తుల నుంచి కంప్లెంట్స్​ వచ్చాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కమిటీ సభ్యులు చెప్పారు. ఆలయానికి వచ్చే స్త్రీ, పురుషుల వస్త్ర ధారణ హుందాగా ఉండాలని  ఆలయ ప్రధాన అధ్యక్షుడు జయప్రకాశ్ సోమానీ తెలిపారు.  ఒక వేళ ఎవరైనా నిషేధించిన దుస్తులు ధరించి వస్తే వారిని ఆలయం లోపలికి అనుమతి ఉండదని దేవాలయం బయటనుంచే నమస్కరించుకుని వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.  అలా వచ్చి సంప్రదాయ దుస్తులు మార్చుకోవాలన్నా.. అందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశామని తెలిపారు.