కుషాయిగూడ, వెలుగు: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈసీఐఎల్ (ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ఫైనాన్స్ డైరెక్టర్ గా రాజేంద్రకుమార్ పరాఖ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. రాజేంద్రకుమార్ గతంలో గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ సెక్రటరీగా పనిచేశారు. ఈసీఐఎల్ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తానని ఆయన తెలిపారు.
