హైదరాబాద్: కోల్‌కతాపై విజయంతో జోష్‌లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ తగిలింది. ఎస్ఆర్హెచ్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ టోర్నీ వీడి అర్ధాంతరంగా తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. వెన్ను నొప్పి కారణంగా ఈ సీజన్‌లోని తొలి రెండు మ్యాచ్‌లకు కమిన్స్ దూరమైన సంగతి తెలిసిందే. అయితే, గాయం నుంచి కోలుకుని ఐపీఎల్ కోసం ఇండియాకు వచ్చి నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. కానీ మైదానంలోకి తిరిగి అడుగుపెట్టడానికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అతడికి ఇంకా అనుమతి ఇవ్వలేదు.
దీంతో తుది అనుమతి కోసం కమిన్స్ మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లినట్లు సమాచారం. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు పర్యవేక్షణలో కమిన్స్‌కు ఒక స్కాన్ జరగనుంది. ఈ స్కాన్‌లో గాయం పూర్తిగా నయమైనట్లు రిపోర్టు వస్తే ఐపీఎల్ ఆడేందుకు అతడికి లైన్ క్లియర్ కానుంది. కమిన్స్ తిరిగి ఏప్రిల్ 17న జట్టులో చేరే అవకాశం ఉంది. దీంతో అతడు ఐపీఎల్ తొలి ఐదు మ్యాచులకు దూరం కానున్నాడు.
►ALSO READ | Rohit Sharma: ధోనీ రికార్డ్ బ్రేక్ చేసిన హిట్ మ్యాన్.. ఆరెంజ్ క్యాప్ని కైవసం చేసుకున్న రోహిత్
కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో ఎస్ఆర్హెచ్ తాత్కాలిక కెప్టెన్‌గా ఇండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ ఎంపికైన విషయం తెలిసిందే. ఇషాన్ నేతృత్వంలోని ఎస్ఆర్హెచ్ ఈ సీజన్‌ను ఓటమితో మొదలుపెట్టింది. తొలి మ్యాచులో ఆర్సీబీ చేతిలో సన్ రైజర్స్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమి నుంచి వెంటనే తేరుకున్న ఎస్ఆర్హెచ్ రెండో మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఘన విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. ఎస్ఆర్హెచ్ తమ నెక్ట్స్ మ్యాచులో పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జైయింట్స్‌తో తలపడనుంది.
