V6 News

జార్ఖండ్‌‌ సీఎం సన్నిహితుడు ప్రేమ్ ప్రకాష్ ఇంటిపై ఈడీ దాడులు

జార్ఖండ్‌‌ సీఎం సన్నిహితుడు ప్రేమ్ ప్రకాష్ ఇంటిపై ఈడీ దాడులు

రాంచీ: జార్ఖండ్‌‌ సీఎం హేమంత్ సోరెన్‌‌ సన్నిహితుడి ఇంటి నుంచి ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)రెండు ఏకే 47 రైఫిళ్లతో పాటు60 కాట్రిడ్జ్‌‌(బుల్లెట్లు)లను స్వాధీనం చేసుకుంది. అక్రమ మైనింగ్ స్కామ్ కేసుకు సంబంధించి జార్ఖండ్‌‌ సీఎం సన్నిహితుడు ప్రేమ్ ప్రకాష్ ఇంటిపై ఈడీ బుధవారం దాడులు నిర్వహించింది. సోదాల్లో రెండు ఏకే -47లను గుర్తించామని అధికారులు చెప్పారు.

హేమంత్‌‌ సోరెన్‌‌తో ప్రేమ్‌‌ ప్రకాశ్‌‌కు ఉన్న సంబంధాల నేపథ్యంలో రాంచీలోని ఆయన ఇంటిపై దాడులు చేపట్టినట్లు తెలిపారు. మొత్తం 16 చోట్ల తనిఖీలు మొదలయ్యాయి. "ఇప్పటి వరకు స్వాధీనం చేసుకొన్న నగదు, బ్యాంక్‌‌ ఖాతాల్లోని సొమ్ము సాహిబ్‌‌గంజ్‌‌ సమీప అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌‌ ద్వారా సంపాదించినట్లు తేలింది. మరో రూ.100 కోట్ల జాడ తెలిసింది. వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నాం" అని అధికారులు చెప్పారు.