పంది మెదడులో చిప్‌.. ఎలన్ మస్క్ స్టార్టప్ ప్రయోగం

పంది మెదడులో చిప్‌.. ఎలన్ మస్క్ స్టార్టప్ ప్రయోగం

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్ మస్క్ ఏది చేసినా అద్భుతమే అనేలా ఉంటుంది. ఆయనకు న్యూరాలింక్ అనే న్యూరోసైన్స్ స్టార్టప్ కంపెనీ కూడా ఉంది. ఈ స్టార్టప్ తాజాగా నాణెమంత సైజులో ఉండే కంప్యూటర్‌‌ చిప్‌ను ఒక పంది మెదడులో అమర్చింది. సదరు పంది మెదడులో ఆ చిప్‌ను రెండు నెలల పాటు ఉంచనున్నారు. పందికి ఉన్న అనారోగ్యాన్ని నయం చేయాలన్నదే ఈ ఎక్స్‌పెరిమెంట్ ఉద్దేశం. ఒవకేళ ఈ ప్రయోగం విజయవంతమైతే మనుషుల రోగాలను తగ్గించడానికి వారి మెదళ్లలోనూ కంప్యూటర్ చిప్‌ను బిగించాలన్నదే మస్క్ ఆలోచనగా తెలుస్తోంది.

క్లిష్టమైన మానవ అవయవమైన మెదడులో సదరు వైర్‌‌లెస్ చిప్‌ను అమర్చడం ద్వారా న్యురోలాజికల్ సమస్యలైన అల్జీరియా, డెమెంటియా, స్పైనల్ కార్డ్‌ గాయాలను నయం చేయాలన్నదే లక్ష్యంగా మస్క్ కంపెనీ ముందుకు వెళ్తోందని సమాచారం. అమర్చగలిగే డివైజ్ ఉంటే జ్ఞాపక శక్తి, వినే శక్తిని కోల్పోవడంతోపాటు డిప్రెషన్, ఇన్సోమ్నియా లాంటి సమస్యలను నయం చేయొచ్చునని మస్క్ చెప్పారు. శుక్రవారం వెబ్‌కాస్ట్‌ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.