
టాలీవుడ్ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్‌పై (Bandla Ganesh) క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూప్ చైర్మన్ నౌహిరా షేక్ తన ఇంట్లో రెంట్ కి ఉంటున్న బండ్ల గణేష్.. ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి తన ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని హీరా గ్రూప్ చైర్మన్ నౌహిరా షేక్ కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు బండ్ల గణేశ్‌పై కేసు రిజిస్టర్ చేశారు.
అసలు విషయం ఏంటంటే.. హీరా గ్రూప్ చైర్మన్ నౌహిరా షేక్ ఫిలింనగర్‌లోని తన ఇంటిని నెలకు లక్ష రూపాయల చొప్పున బండ్ల గణేష్ కు అద్దెకు ఇచ్చారు. అయితే కొంతకాలంగా ఆయన అద్దె ఇవ్వకపోగా.. గుండాలతో బెదిరిస్తున్నారని, తన ఇంట్లోకి తననే రానివ్వకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. వేధింపులుల తాళలేక.. ఇంటిని ఖాళీ చేయాలని అడిగినందుకు తనను బెదిరిస్తున్నారని, రాజకీయ నాయకుల అండతో తన ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసుల ఫిర్యాదులో తెలిపారు.
అయితే.. అలా ఫిర్యాదు చేసినందుకు గాను తిరిగి తనపైనే పోలీసులు కేసు నమోదుచేశారని ఆమె తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇటీవల ఆమె డీజీపీకి ఫిర్యాదు చేశారు. దాంతో స్పందించిన ఫిలిమ్ నగర్ పోలీసులు నిర్మాత బండ్ల గణేశ్‌పై ఐపీసీ 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.