అయోధ్యలో ‘ఎర్రని’ రాముడు..ఆవిష్కరించిన యోగి

అయోధ్యలో ‘ఎర్రని’ రాముడు..ఆవిష్కరించిన యోగి

ఉత్తరప్రదేశ్‌‌: అయోధ్యలో ఏడు అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌ శుక్రవారం ఆవిష్కరించారు. రోజ్‌‌వుడ్‌‌తో తయారు చేసిన ఈ విగ్రహాన్ని స్థానిక శోధ్‌‌ సంస్థాన్‌‌ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. రూ.35 లక్షలు పెట్టి కర్ణాటకలోని ఆర్ట్‌‌ అండ్‌‌ క్రాఫ్ట్‌‌ ఎంపోరియం నుంచి ఈ విగ్రహాన్ని కొన్నారు. విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ ఏడాది అయోధ్యలో ఓ గొప్ప కార్యానికి నాంది పలకాలని కోరుకుంటున్నా. ఇక్కడి ప్రజలంతా ప్రధాని నరేంద్ర మోడీని ఆశీర్వదించారు. ఆయన ఈ దేశాన్ని సూపర్‌‌ పవర్‌‌గా తయారు చేస్తారు. ప్రజలు నెగిటివ్‌‌ పాలిటిక్స్‌‌ను తిప్పికొట్టారు. దేశం సురక్షితంగా ఉంటేనే మతమూ సురక్షితంగా ఉంటుంది. ఇది రాముడు పుట్టిన ప్రాంతం. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతోంది. రామ మందిర నిర్మాణం నా కోరిక’ అని సీఎం యోగి అన్నారు.