హెచ్​సీయూలో భారతీయ భాషా సంస్థ బృందం

హెచ్​సీయూలో భారతీయ భాషా సంస్థ బృందం

గచ్చిబౌలి, వెలుగు: కర్ణాటక రాష్ట్రం మైసూరులోని భారతీయ భాషా సంస్థలో శిక్షణ పొందుతున్న పరిశోధకులు, అధ్యాపకులు సోమవారం గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించారు. వర్సిటీలోని తెలుగు శాఖ, అంతరిస్తున్న భాషలు అండ్​మాతృభాషల అధ్యయన సంస్థ(సీఈఎల్అండ్​ఎంటీఎస్) శాఖను సందర్శించారు. ఆరుగురు సభ్యులతో కూడిన ఈ బృందానికి డా.మిరియాల సత్యనారాయణ లీడ్​గా వ్యవహరించారు.10 నెలల కోర్సులో భాగంగా మైసూరులో తెలుగు, మలయాళం, కన్నడ, తమిళంపై ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు.

తెలుగు భాషా వైవిద్యాన్ని తెలుసుకునేందుకు హెచ్​సీయూని సందర్శించామన్నారు. తెలుగు భాషా సంస్కృతిక, చారిత్రక, మత, సామాజిక, ఆర్థికాంశాలను లోతుగా తెలుసుకుంనేందుకు 14 రోజుల పాటు ఎడ్యుకేషన్​టూర్​నిర్వహిస్తున్నామన్నారు. హెచ్​సీయూ తెలుగు శాఖ అధ్యక్షుడు దార్ల వెంకటేశ్వర్​రావు, సీఐఎల్​ అండ్ ఎంటీఎస్ శాఖ అధ్యక్షుడు పమ్మి పవన్​ కుమార్ వారికి పలు అంశాలను వివరించారు.