వందేళ్లుగా ఒకే ఇంట్లో 25 కుటుంబాల దీపావళి సంబురాలు

వందేళ్లుగా ఒకే ఇంట్లో 25 కుటుంబాల దీపావళి సంబురాలు

ఉద్యోగాల  కోసమో... వ్యాపారాల  కోసమో... బిజీ బిజీగా  గడిపే రోజులివి.  పండగలకు  ఏదో కలిశాం.. అనేది తప్ప  ధ్యాసంతా  వృత్తి మీదే  ఉంటుంది.  కానీ  మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం  ఒక ఫ్యామిలీ  దీపావళిని  గ్రాండ్ గా  జరుపుకుంటోంది. ఏ దేశాల్లో  ఉన్నా సరే... తప్పక కలుసుకుని  మూడు రోజుల  పాటు పండగను  ఇంటిల్లపాది  చేసుకుంటారు. కౌకుంట్ల నుంచి న్యూజిలాండ్ దాకా ఎక్కడ ఉన్నా.. ఎంత బిజీగా ఉన్నా దీపావళి పండక్కి తప్పక కలుసుకుంటారు. నోరురించే వంటకాలతో ఆడవాళ్లంతా ఇల్లంతా గుమగుమలాడిస్తారు. మగ వాళ్లు, పిల్లలు, వృద్దులు అంతా యోగక్షేమాల తెలుసుకుంటూ సంతోషాలను పంచుకుంటారు. ఈ 3 రోజులపాటు ఇంటిల్లపాది వయసు, టైం మరచిపోతారు. పోటీ పడి టపాసులు కాలుస్తారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుపుకుంటారు. చిన్నపిల్లలకు పోటీలు నిర్వహించి ప్రైజ్ లు ఇస్తుంటారు.

మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం నందిపేట గ్రామానికి చెందిన వెంకయ్య, బాలమ్మ కుటుంబ సభ్యులది ఉమ్మడి కుటుంబం. వీరి 25 కుటుంబాలు  కౌకుంట్ల వెల్పేర్ అసోసియేన్ గా ఏర్పడ్డారు. దీపావళిని ఒకే చోట జరుపుకునే వారని తెలిసి... ఇప్పుడు వారి వారసులు కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 1921 నుంచి ఈ పద్దతిని కొనసాగిస్తున్నారు. వందేళ్ల క్రితం నుంచి వస్తున్న సిస్టమ్ ను పాటిస్తున్నారు. తమ పూర్వీకుల లాగే దీపావళి పండగను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఒకరి ఇంట్లో నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి మహబూబ్ నగర్ సుభాష్ నగర్ లో ని కౌకుంట్ల చంద్రమౌళి నివాసంలో దీపావళి వేడుకల్లో కుటుంబసభ్యులంతా పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం..

దీపావళి గిఫ్ట్‌: ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇచ్చిన కంపెనీ

షేర్‌‌ మార్కెట్ దీపావళి ముహుర్తం ట్రేడింగ్

కరోనా వల్ల అనాథలైన పిల్లలతో సీఎం దీపావళి వేడుకలు