పాక్ సరిహద్దులో రేగిన కార్చిచ్చు దృశ్యాలు

 పాక్ సరిహద్దులో రేగిన కార్చిచ్చు దృశ్యాలు

జమ్ము కశ్మీర్‌లోని పాక్ సరిహద్దు సమీపంలో చెలరేగిన మంటల కారణంగా సుమారు అర డజను ల్యాండ్ మైన్లు పేలినట్టు ఇటీవలే అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఎల్ వోసీ ప్రాంతంలో రాజుకున్న ఈ కార్చిచ్చు మెండర్ సెక్టార్‌లో పాకిస్తాన్ నుంచి భారత్ వైపుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. భారత్‌లోకి సరిహద్దు గుండా అక్రమంగా చొరబడే వారిని అడ్డుకోవడానికి జవాన్లు ల్యాండ్‌మైన్లు నాటారు. అయితే, సరిహద్దు అడవుల్లో మొదలైన ఈ కార్చిచ్చు కారణంగా ఆ ల్యాండ్‌మైన్లు పేలిపోయినట్టు అధికారులు వెల్లడించారు. సుమారు మూడు రోజులపాటు కొనసాగిన ఈ మంటలను ఆర్మీ సహకారంతో అటవీ అధికారులు ఆర్పే ప్రయత్నాలు చేశారు. కొంత మేర అదుపులోకి తెచ్చామని కూడా వారు ఇప్పటికే వెల్లడించగా.. ఆ నిప్పు రవ్వలు రాజుకొని అడవి అంతటా మంటలు వ్యాపించే వీడియోను తాజాగా అధికారులు విడుదల చేశారు.

 

మరిన్ని వార్తల కోసం...

రాయదుర్గంలో భారీ అగ్నిప్రమాదం

ఆకట్టుకునేలా కోస్ట్ గార్డ్‌ క్యాడెట్ల కవాతు