
పానీపూరంటే తెలియని వాళ్లు తక్కువగా ఉంటారేమో. ఎక్కువగా రోడ్డు పక్కన బండ్లపై దొరికే ఈ పానీ రేటు తక్కువగానే ఉంటుంది. మా అంటే ప్లేట్ 10 రూపాయలు లేదా..20 రూపాయలు ఉంటుంది. కాస్త కాస్ట్ లీ హోటళ్లలో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ ముంబై ఎయిర్ పోర్టులో పానీ పూరి రేటు చూస్తే షాకవుతారు. ప్లేట్ పానీ పూరిని ఏకంగా రూ.333 కు అమ్ముతున్నారు. ఎయిర్ పోర్టులో ఈ రేట్లను చూసిన ముంబై వ్యాపారవేత్త కౌశిక్ ముఖర్జీ ముక్కున వేలేసుకున్నాడున ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్లో తెలిపారు.
ముంబై ఎయిర్ పోర్టులోని ఫుడ్ స్టాల్స్ లో కాస్ట్ లీ అని తెలుసు కానీ మరీ ఇంత కాస్ట్ అని తెల్వదు అని పోస్ట్ చేశారు. ముఖర్జీ షేర్ చేసిన ఈ ఫోటోలో దహీ పూరీ, పానీ పూరీ, సెవ్ పూరీ అని ఉన్నాయి. ఒక్కో ప్లేటులో 8 పీసులు ఉన్నాయి. ఏదైనా ప్లేట్ కు రూ. 333గా ఉంది. ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు. వామ్మో ఎయిర్ పోర్టులో మరీ ఇంత ఎక్కువగానా అని మండిపడుతున్నారు. కొన్ని రోజుల తర్వాత పన్నీర్ కూడా బంగారం షాపుల్లో చిన్ని చిన్న ప్యాకెట్లలో పెట్టి అమ్ముతారేమో అంటూ బాలీవుడ్ మూవీ త్రీ ఇడియట్స్ లో అమీర్ ఖాన్ చెప్పే డైలాగ్ ను గుర్తు చేస్తూ కామెంట్ చేశారు.
2023లో ముంబై ఎయిర్ పోర్టులోని ఒక రెస్టారెంట్లో కూడా దోష రూ. 600 ,గ్లాస్ బట్టర్ బిల్క్ రూ. 620 కి అమ్ముతున్నారని పోస్ట్ చేయడం వైరల్ అయిన సంగతి తెలిసిందే.. అంతకుముందు కూడా ఇదే ఎయిర్ పోర్టులో రెండు సమోసాలు, ఒక కప్పు టీ , వాటర్ బాటిల్‌కు రూ. 490 పెట్టి కొన్నానని ఓ జర్నలిస్ట్ పోస్ట్ పెట్టాడు.
Real estate is expensive for food stalls at the CSIA Mumbai airport - but I didn’t know THIS expensive 👀 pic.twitter.com/JRFMw3unLu
— Kaushik Mukherjee (@kaushikmkj) April 29, 2024