బిగ్ బ్రేకింగ్ : UAE ఫుజైరా పోర్టుపై ఇరాన్ మళ్లీ దాడులు : ఆయిల్ లోడింగ్ పూర్తిగా బంద్

బిగ్ బ్రేకింగ్ : UAE ఫుజైరా పోర్టుపై ఇరాన్ మళ్లీ దాడులు : ఆయిల్ లోడింగ్ పూర్తిగా బంద్

ఇరాన్ దేశం దాడులు ఊహకు అతీతంగా ఉన్నాయి. UAE.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఫుజైనా ఆయిల్ పోర్టుపై మళ్లీ దాడి చేసింది ఇరాన్. మిస్సైల్స్, డ్రోన్ బాంబులతో విరుచుకుపడింది. 2026, మార్చి 16వ తేదీ మధ్యాహ్నం జరిగిన దాడిలో.. ఫుజైరా పోర్టు నుంచి మంటలు భారీగా ఎగసిపడ్డాయి. పోర్టు బాగా దెబ్బతిన్నది. ఈ క్రమంలోనే పోర్టులో ఆయిల్ లోడింగ్ మొత్తం నిలిపివేసింది కంపెనీ. ఫుజైరా పోర్టు నుంచి ఇంధనం ఎగుమతులు భారీగా ఉంటాయి.. ఎంత అంటే ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆయిల్ పోర్టు.. ఇప్పుడు ఈ ఆయిల్ పోర్టు మూసివేశారు. 

అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు.. ఇరాన్ దేశంలోని పలు నగరాలపై బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటన జరిగిన రెండు గంటల తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. UAE టార్గెట్ గా మిస్సైల్స్, డ్రోన్లతో బీభత్సం చేసింది. UAEలోని ఆయిల్ కంపెనీలు, పోర్టులే లక్ష్యంగా ఈ దాడులు చేసింది ఇరాన్.

ALSO READ : ఇరాన్ డ్యాన్సింగ్ మిస్సైల్స్ అంటే ఏంటి..?

రెండు రోజుల క్రితం UAEలోని ఫుజైరా ఆయిల్ డిపో, పోర్టులపై దాడి చేసిన ఇరాన్.. మళ్లీ అదే పనిని రిపీట్ చేసింది. ఇవాళ జరిగిన దాడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. ఫుజైరా ఏరియా నుంచి పెద్ద స్థాయిలో మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలోనే పోర్టును చూసివేసింది యూఏఈ సర్కార్. ఆయిల్ లోడింగ్ బంద్ చేసింది. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆయిల్ లోడింగ్ పోర్టు ఇదే.. ఈ ఆయిల్ లోడింగ్ డిపో మూతబడటంతో.. చాలా దేశాలకు ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావం దక్షిణ కొరియా, జపాన్ దేశాలపై తీవ్రంగా పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.