మొయినాబాద్ ఫామ్ హౌస్కు సంబంధించి రిమాండ్ రిపోర్టు విడుదల చేశారు పోలీసులు. సోమవారం (మార్చి 16) వెల్లడించిన రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీకెండ్ డ్రగ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు ముందుగానే పైలట్ రోహిత్ రెడ్డి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి పిలిస్తేనే అందరూ డ్రగ్స్ పార్టీకి వచ్చారని రిపోర్టు ద్వారా వెల్లడించారు.
రిమాండ్ రిపోర్టు పూర్తి వివరాలు:
- ఫామ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్ తో పాటు మందు పార్టీ జరిగింది
- ఫామ్ హౌస్ లోకి వెళ్ళగానే మొదటగా బుల్లెట్ సౌండ్ వినబడింది
- బుల్లెట్ సౌండ్ విని వెంటనే మేమంతా అప్రమత్తమయ్యాం..
- మేము పోలీసులం, కాల్చవద్దు.. ఎలాంటి చర్యలు తీసుకోమని గట్టిగా అరిచాం
- మేము చెప్తున్నప్పటికీ కూడా మరో రెండు సార్లు బుల్లెట్ సౌండ్ వినిపించింది
- మరోవైపు మీరు కాల్చి చేయండి.. నేను మొత్తం చూసుకుంటాను ఏం జరిగినా నాదే బాధ్యత అంటూ గట్టిగా వినపడింది..
- మేమంతా గట్టిగా అరిచేసరికి ఒకసారిగా ఫైరింగ్ సౌండ్ నిలిచిపోయింది
- మేమంతా ఒక్క సారిగా స్విమ్మింగ్ పూల్ వద్దకు చేరుకున్నాము
- ఫామ్ హౌస్ లో సెర్చ్ చేసేందుకు అప్పటికే మేము వారింట్ తీసుకున్నాం
- లోపలికి వెళ్లిన వెంటనే సెర్చ్ వారెంట్లను రోహిత్ రెడ్డికి ఇచ్చాము
- బాత్రూం దగ్గర ఉన్న నమిత్ శర్మ చేతిలో తుపాకిని స్వాధీనం చేసుకున్నాము..
- బుల్లెట్ షెల్స్ పట్టుకొని మరొకరు ఉన్నారు.. అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నాం..
- ఫామ్ హౌస్ లో ఒక మహిళతో పాటు పదిమందిని అదుపు తీసుకున్నాం..
- జర్మన్ మేడ్ రివాల్వర్ పాయింట్ 32 ని స్వాధీనం పరుచుకున్నాం..
- 11 మందిని విడివిడిగా విచారణ జరిపాము..
- ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పి బుకాయించే ప్రయత్నం చేశారు..
- అందరినీ పదేపదే విచారించడంతో చివరికి సిల్వర్ శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఒప్పుకున్నాడు..
- అతని చెక్ చేసినప్పుడు రెండు గ్రాముల కొకైన్ బయటపడింది..
- కొకైన్ ఎవరు తెచ్చారు అనే విషయాన్ని ముందుగా అడిగితే చెప్పలేదు..
- పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ ను విచారించినప్పుడు కొకైన్ ఎవరు తెచ్చారనే విషయం బయటపడింది..
- ఈ డ్రగ్ కోసం కొంత డబ్బుని కొందరికి ఇచ్చినట్లు డ్రైవర్ ఒప్పుకున్నాడు..
- కొకైన్ తానే తెచ్చుకున్నానని కౌశిక్ ఒప్పుకున్నాడు..
- సిమ్లా బిజినెస్ ట్రిప్ కు వెళ్ళినప్పుడు తాను కొకైన్ తీసుకొచ్చినట్లు చెప్పాడు..
- సిమ్లాలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ డ్రగ్ ను తీసుకొన్నట్టు తెలిపాడు..
- డ్రగ్ పార్టీ కోసమే కొకైన్ ను తీసుకువచ్చినట్లు కౌశిక్ చెప్పాడు..
- ఒక్కొక్క గ్రామ కి 15 వేల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసినట్లు కౌశిక్ చెప్పాడు..
- 11 మందికి డ్రగ్ లైవ్ కిట్టు ద్వారా టెస్టులు చేశాం.
- అర్జున్ రెడ్డి ,కౌశిక్ రవి ,రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి లకు డ్రగ్ పాజిటివ్ గా వచ్చింది..
- కాల్పులు జరిపిన నమిత్ శర్మని అదుపులోకి తీసుకున్నాం..
- పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందిన రివాల్వర్ గా గుర్తించాం ..
- లైసెన్స్ డ్ రివాల్వర్ నితీష్ రెడ్డి వద్ద ఉండాల్సింది నమిత్ శర్మ వద్దకు వచ్చింది..
- ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్లు నమిత్ శర్మ చెప్పాడు.
- ఫామ్ హౌస్ లోకి వస్తున్న పోలీసులను భయభ్రాంతులకు గురిచేసినందుకే కాల్పులు జరిపినట్లు తెలిపారు..
- కాల్పులు జరిపి ఫామ్ హౌస్ నుంచి తప్పించుకుని పారిపోవాలని ప్లాన్ చేశారు..
- కాల్పులతో పోలీసుల్ని తీవ్రంగా గాయపరచాలని అనుకున్నారు..
- పార్టీలో ఉన్నవాళ్లు లిక్కర్ తో పాటు డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నారు..
- రెండవ ఒపీనియన్ కోసం ఎర్రగడ్డ ఆసుపత్రిలో అందరి రక్త మునాలు మళ్లీ పరీక్షించాం
- రెండోసారి పరీక్షలు జరిగినప్పుడు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కి డ్రగ్ పాజిటివ్ గా వచ్చింది..
- నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో బయటపడింది.
- పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి అర్జున్, రెడ్డిలు కొకైన్ తీసుకున్నట్లుగా రిపోర్ట్ వచ్చింది.
- ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో మొత్తం ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ గా వచ్చింది..
- నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి , రితేష్ రెడ్డి, పుట్టా మహేష్ కుమార్, అర్జున్ రెడ్డి , కౌశిక్ రవి లకు డ్రగ్ పాజిటివ్ వచ్చింది..
- మద్యంలో కొకైన్ కలుపుకొని తాగడం జరిగింది..
