అభివృద్ధి పనులకు ఫండ్స్​కేటాయించాలి

అభివృద్ధి పనులకు ఫండ్స్​కేటాయించాలి
  • మున్సిపల్ సమావేశాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు 
  • భార్య లోపల...  భర్త బయట నిరసన

రామకృష్ణాపూర్,వెలుగు: క్యాతన్ పల్లి మున్సిపాలిటీలోని తమ వార్డుల్లో అభివృద్ధి పనులకు ఫండ్స్ కేటాయించడం లేదంటూ ముగ్గురు అధికార టీఆర్ఎస్​ కౌన్సిలర్లు మున్సిపల్​మీటింగ్​బహిష్కరించారు. శుక్రవారం ఉదయం మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు హాజరయ్యారు. మున్సిపాలిటీకి ఎక్కువ ఆదాయ వనరులు సమాకూర్చుతున్న తమ మూడు వార్డుల్లో అభివృద్ధి పనులకు ఫండ్స్​కేటాయించాలని 7,8,9 వార్డుల కౌన్సిలర్లు పోలం సత్యం, అల్గుల శ్రీలత, పారిపెల్లి తిరుపతి డిమాండ్ చేశారు. తమకు చైర్ పర్సన్​ గతంలో మాటిచ్చి నిలబెట్టుకోలేదని ఫైర్ అయ్యారు. అంతకు ముందు ముగ్గురు కౌన్సిలర్లతో చైర్​ పర్సన్​ జంగం కళ, వైస్​ చైర్మన్​ సాగర్​రెడ్డి, మున్సిపల్​ మేనేజర్​ నాగరాజు, ఏఈ అచ్యుత్​ సమస్యపై చర్చించినా.. వినలేదు. తక్కువ జనాభా ఉన్న రామకృష్ణాపూర్​ ప్రాంతంతో సంబంధం లేకుండా తమ వార్డులకు  జనరల్​ఫండ్​నుంచి ప్రత్యేకంగా ఎక్కువ  నిధులు కావాలని అప్పటి వరకు సమావేశానికి హాజరుకామంటూ భీష్మించుకున్నారు. ఎనిమిదో వార్డు కౌన్సిలర్​ అల్గుల శ్రీలత సమావేశానికి రాకుండానే  వెళ్లిపోగా 7,9 వార్డు కౌన్సిలర్లు సత్యం, తిరుపతి మీటింగ్​ను బాయ్ కాట్ చేస్తున్నట్లు చెప్పివెళ్లిపోయారు. 

మరోవైపు సమావేశం జరుగుతున్న టైంలో మూడో వార్డు కౌన్సిలర్​ కొక్కుల స్రవంతి సైతం తమకు మీటింగ్ లపై సమాచారం ఇవ్వడంలేదని ఫైర్ అయ్యారు. ఇదే విషయంపై ఆమె భర్త సత్యనారాయణ సైతం బయట గొడవ చేశారు. మరోవైపు కౌన్సిలర్లు కనీసం వార్డు సమస్యలు చెప్పుకునే పరిస్థితిలేదని, మున్సిపల్​ఆఫీసర్లు ఇష్ట్యరాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష కౌన్సిలర్లు మండిపడుతున్నారు. మున్సిపల్​ కీలక ఆపీసర్​ ఒక్కరూ  స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో పనిచేస్తూ తమ  సమస్యలు  పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. సమావేశంలో వైస్ చైర్మన్​సాగర్​రెడ్డి, మున్సిపల్​ మేనేజర్​ కీర్తి నాగరాజు, ఏఈ అచ్యుత్, రెవెన్యూ ఆఫీసర్​ కృష్ణప్రసాద్​, ఇన్​చార్జి శానిటరీ ఇన్​స్పెక్టర్​వసంత్ తదితరులు పాల్గొన్నారు.