‘గాంధీ’లో రీజినల్ క్లినికల్ ట్రయల్స్ యూనిట్

‘గాంధీ’లో రీజినల్ క్లినికల్ ట్రయల్స్ యూనిట్
  • ఐసీఎంఆర్​ఉత్తర్వులు 

పద్మారావునగర్, వెలుగు: గాంధీ మెడికల్ కాలేజీలో రీజినల్​ క్లినికల్ ​ట్రయల్స్ ​యూనిట్(ఆర్​సీటీయూ) ఏర్పాటుకు ఐసీఎంఆర్​ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేంద్రం నిర్దేశించే క్లినికల్ ట్రయల్స్​ గాంధీ మెడికల్​ కాలేజీలో కూడా చేస్తారు. ఇండియన్ ​క్లినికల్ ​ట్రయల్ ​అండ్ ఎడ్యుకేషన్ ​నెట్​వర్క్​(ఇంటెంట్​)లో భాగంగా అడ్వాన్స్​డ్​ సెంటర్​ఫర్ ​క్లినికల్ ​ట్రయల్​(ఏసీసీటీ), రీజినల్​ క్లినికల్​ట్రయల్ ​యూనిట్​(ఆర్​సీటీయూ), ఐసీఎంఆర్​ సెంటర్​ ఫర్ ​క్లినికల్ ట్రయల్​ (ఐసీసీటీ),స్పెషాలిటీ సెంటర్​ఫర్ ​క్లినికల్ ​ట్రయల్​(ఎస్​సీసీటీ), నాలెడ్జ్​పార్ట్​నర్​ ఫర్​ క్లినికల్ ​ట్రయల్​(కేపీసీటీ) లాంటి 5 విభాగాల్లో దేశవ్యాప్తంగా క్లినికల్ ​సెంటర్లను ఐసీఎంఆర్​ ఎంపిక చేసింది.  ఇందులో భాగంగా సౌతిండియా నుంచి  గాంధీ మెడికల్ ​కాలేజీ ఎంపికైంది.