పోలింగ్ రోజున13 వేల 500 పోలీసులతో బందోబస్తు: సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

పోలింగ్ రోజున13 వేల 500 పోలీసులతో బందోబస్తు: సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో13 వేల 500 పోలీసులు, సీఏపీఎఫ్ నుంచి 13, సీఆర్పీఎఫ్ నుంచి 22 కంపెనీలు ఎన్నికల బందోబస్తులో పాల్గొంటాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మే 6వ తేదీ సోమవారం సీపీ మీడియా సమావేశంలో ఎలక్షన్ బందోబస్తుపై మాట్లాడుతూ..  పోలింగ్ రోజు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర సెంట్రల్ బలగాలతో బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు.  అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి తక్కువ సెంట్రల్ బలగాలు హైదరాబాద్ కు వచ్చాయని.. మరిన్ని బలగాలను పంపాలని కోరామన్నారు.

పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ లొకేషన్స్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేస్తామని సీపీ తెలిపారు. ఎఫ్ఎస్ టీ, ఎస్ఎస్ టీ టీమ్స్ నోటిఫికేషన్ వచ్చిన నుండి పనిచేస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ పోలీసుల నుంచి క్విక్ రియాక్షన్ టీమ్స్ కూడా పని చేస్తున్నాయని తెలిపారు. 85 మంది ఏసీపీలకు ప్రత్యేక టీమ్స్ ఉన్నాయని.. పోలింగ్ రోజు ఈ టీమ్స్ పని చేస్తాయన్నారు. పోలింగ్ రోజు192 లా అండ్ ఆర్డర్ పికెట్స్ ఏర్పాటు చేస్తామని... స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర మూడు లేయర్ల బందోబస్తు ఉంచుతామని ఆయన వివరించారు. ఎన్నికల కోడ్ వచ్చిన నుంచి ఇప్పటివరకు రూ.18 కోట్ల అక్రమ నగదును పట్టుకున్నామని.. 
రూ.12 కోట్ల విలువైన బంగారం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు సీపీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.