కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్ నేత గడ్డం వెంకటస్వామి (కాకా) వర్ధంతి సందర్భంగా సోమవారం బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో స్టూడెంట్స్ రీ యూనియన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, అసెంబ్లీ స్పీడర్ గడ్డం ప్రసాద్ కుమార్, కాకా కుటుంబసభ్యులు మంత్రి వివేక్, సరోజ దంపతులు, ఎమ్మెల్యే వినోద్ హాజరయ్యారు. కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అలాగే అంబేద్కర్ లా కాలేజీ గ్రాడ్యుయేషన్ డేలోనూ కాకా కుటంబసభ్యులు పాల్గొన్నారు
