వర్షం కారణంగానే నిమజ్జనాలు లేటయితున్నయ్

వర్షం కారణంగానే నిమజ్జనాలు లేటయితున్నయ్

హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్, ట్యాంక్ బ్యాండ్ లో జరుగుతున్న వినాయక నిమజ్జనాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులతో కలిసి బోట్ లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ... నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలకు అన్నిరకాల ఏర్పాట్లు చేశామన్నారు. ధార్మిక, సంప్రదాయాల ప్రకారం గణేష్ ని పూజిస్తామని. వివిధ డిపార్ట్మెంట్ల కో ఆర్డినేషన్ తో నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ఎంత ఖర్చయినా ఏర్పాట్లు చేయమని ఆదేశించారని చెప్పుకొచ్చారు. 

ఈ రోజు, రేపు నిమజ్జనాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా తలసాని స్పష్టం చేశారు. రెండు రోజులుగా వర్షం ఉంది కాబట్టి నిమజ్జనాలు కొంత ఆలస్యంగా కొనసాగుతున్నాయని తెలిపారు. భక్తులు ఎలాంటి హడావిడి లేకుండా రేపటి వరకు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.  పండగలను సీఎం ఘనంగా నిర్వహిస్తుంటారన్న మంత్రి.. వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా... సాఫీగా సాగుతున్నాయని, భక్తులు సహకరించాలని కోరారు.