పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

పెరుగుతున్న నిత్యావసర వస్తువులతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉల్లి ధర విపరీతంగా పెరిగింది. అయితే వాటిని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఒకటి తగ్గుతోంది అని అనుకునే సమయంలోనే మరో వస్తువు ధర పెరుగుతుండటంతో ప్రజలు సతమతమౌతున్నారు. ఇప్పుడు పెరుగుతున్న లిస్టులోకి వంట గ్యాస్ వచ్చి చేరింది.

ఆగస్టులో 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ. 628 ఉండగా, డిసెంబర్‌లో గ్యాస్‌ బుక్‌ చేసిన వారికి సిలిండర్‌ ధర రూ. 748 చూపిస్తోంది. దీంతో గ్యాస్‌ ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనం. కేవలం నాలుగు నెలల్లోనే గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 120 పెరిగింది.